Flipkart BBD Sale సేల్ నుంచి 12 వేలకే 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ డీల్ మిస్ చేసుకోకండి.!

HIGHLIGHTS

12 వేలకే 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ డీల్ మిస్ చేసుకోకండి

Flipkart BBD Sale సేల్ ఎర్లీ బర్డ్ డీల్స్ ను ఈరోజు నుంచి రివీల్ చేయడం ప్రారంభించింది

ఈ సౌండ్ బార్ ప్రీమియం అండ్ సినిమా థియేటర్ వంటి సౌండ్ అందిస్తుంది

Flipkart BBD Sale సేల్ నుంచి 12 వేలకే 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ డీల్ మిస్ చేసుకోకండి. ఎందుకంటే, దసరా పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఎర్లీ బర్డ్ డీల్స్ ను ఈరోజు నుంచి రివీల్ చేయడం ప్రారంభించింది. ఈ సేల్ డీల్స్ లో భాగంగా లేటెస్ట్ సౌండ్ బార్ బిగ్ డీల్స్ అందించింది. ఈ సేల్ నుంచి ఈరోజు అందించిన డీల్స్ తో 5.2.4 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ను కేవలం 12 వేల రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు.

5.2.4 Dolby Atmos సౌండ్ బార్ : డీల్

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఎర్లీ బర్డ్ డీల్స్ లో భాగంగా MOTOROLA రీసెంట్ గా విడుదల చేసిన AmphisoundX Vibe 5.2.4 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ పై బిగ్ డీల్స్ అందించింది. నిన్నటి వరకు రూ. 15,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో సేల్ అయిన ఈ సౌండ్ బార్ పై రూ. 1,000 డిస్కౌంట్ అందించి రూ. 14,999 ఆఫర్ ధరలో ఫ్లిప్ కార్ట్ ఈ సౌండ్ బార్ ను సేల్ చేస్తోంది.

అదనంగా, ఈ సౌండ్ బార్ పై రూ. 750 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,425 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ సౌండ్ బార్ ని ICICI మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొనుగోలు చేసే వారికి ఈ అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 12,824 రూపాయల ఆఫర్ ధరలో మీకు ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఎర్లీ బర్డ్ సేల్ నుంచి లభిస్తుంది.

Also Read: Xiaomi 18 Pro Max Special Edition ని పూర్తి ట్రాన్స్పరెంట్ డిజైన్ మరియు అబ్బురపరిచే ఫీచర్స్ తో లాంచ్ చేసింది.!

5.2.4 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ సౌండ్ బార్ పవర్ ఫుల్ బాస్ సౌండ్ అందించే డ్యూయల్ సబ్ ఉఫర్, బ్యాక్ సరౌండ్ కోసం డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా ముందు మూడు మరియు పైన రెండు సరౌండ్ స్పీకర్లు ఉండే ప్రీమియం బార్ కలిగి ఉంటుంది. ఈ కంప్లీట్ సెటప్ తో ఈ సౌండ్ బార్ 700w జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ కూడా కలిగి ఉంటుంది.

ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ మరియు 3D మోడ్ వంటి ఫీచర్స్ తో ఈ సౌండ్ బార్ ప్రీమియం అండ్ సినిమా థియేటర్ వంటి సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.1 స్టార్ రేటింగ్ అందుకుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ లో HDMI eArc, USB, ఆప్టికల్, బ్లూటూత్, AUX మరియు COAXIAL వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :