iPhone 17 ఇప్పుడు లక్ష కాదు కేవలం 70 వేల ధరలో లభిస్తుంది .. ఎక్కడంటే.!

HIGHLIGHTS

ఐఫోన్ 17 ఫోన్ ప్రైస్ యాపిల్ అమాంతం పెంచేసింది

ఐఫోన్ 17 ధర ఏకంగా లకారానికి చేరుకుంది

iPhone 17 ఇప్పుడు లక్ష కాదు కేవలం 70 వేల ధరలో లభిస్తుంది

ఐఫోన్ 18 సిరీస్ ఫోన్ లాంచ్ సమయంలో ఐఫోన్ 17 ఫోన్ ప్రైస్ ను పెంచుతున్నట్లు యాపిల్ ప్రకటించింది. లాంచ్ ప్రైస్ తో పోలిస్తే ఏకంగా 20 శాతం వరకు ఈ ఫోన్ ప్రైస్ ను పెంచింది. ఈ దెబ్బకు ఐఫోన్ 17 ధర ఏకంగా లకారానికి చేరుకుంది. అయితే, iPhone 17 ఇప్పుడు లక్ష కాదు కేవలం 70 వేల ధరలో లభిస్తుంది. అయితే, ఇది మీకు లభించేది యాపిల్ అఫీషియల్ సైట్ నుంచి కాదు దసరా సేల్ లో భాగంగా ఈ ఫోన్ ఈ ప్రైస్ లో లభించే అవకాశం ఉంది.

iPhone 17 : ఆఫర్

ఐఫోన్ 17 స్మార్ట్ ఫోన్ ప్రైస్ ను యాపిల్ ఇప్పుడు రూ. 99,900 గా సెట్ చేసింది. అయితే, ఈ ఫోన్ ను త్వరలో రూ. 7X,XXX అందుకోవచ్చని ఫ్లిప్ ఆకృతి సేల్ డీల్ ని అనౌన్స్ చేసింది. విజయదశమి పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఐఫోన్ 17 ని ఈ ఆఫర్ ధరలో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేసింది. ఇది ఫ్లిప్ కార్ట్ నుంచి ఆఫర్ చేయనున్న బిగ్ డీల్ గా కూడా ఫ్లిప్ కార్ట్ అభివర్ణించింది. అయితే, ఈ ఫోన్ పై అందించే అన్ని ఆఫర్స్ తో ఈ ప్రైస్ లో లభిస్తుందని ప్రైస్ పైన స్టార్ గుర్తు, అంటే షరతులు వర్తిస్తాయని తెలిపింది.

ఈ ఫోన్ ప్రైస్ ను ఇప్పుడే ఇంకా క్లియర్ గా చెప్పలేదు. ఈ ఫోన్ రూ. 70,000 నుంచి రూ. 79,999 వరకు ఉండే అవకాశం ఉంటుంది. అయినా సరే, ఈ ఫోన్ అఫీషియల్ సైట్ లో లభించే రేటుతో పోలిస్తే తక్కువ ధరలో దొరికే అవకాశం వుంది. కానీ, ఈ డీల్ నిజంగా లిస్ట్ అవుతుందో లేక సేల్ హిప్ కోసం జిమిక్కో తెలియాలంటే సేల్ రోజు వరకు మనం ఎదురు చూడాల్సి ఉంటుంది.

Also Read: Flipkart Sale నుంచి కేవలం 23 వేలకే లేటెస్ట్ 50 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.!

iPhone 17 : ఫీచర్స్

యాపిల్ ఈ ఫోన్ ను ప్రీమియం, ఫీచర్స్ తో అందించింది. ఈ ఫోన్ ను 6.3 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే తో అందించింది. ఈ స్క్రీన్ 3,000 నిట్స్ పీక్ అవుట్‌ డోర్ బ్రైట్‌నెస్ మరియయు సిరామిక్ షీల్డ్ 2 గ్లాస్ రక్షతో ఉంటుంది. యాపిల్ ఈ ఫోన్ యాపిల్ A19 Chip తో అందించింది. ఈ ఫోన్ 256GB మరియు 512GB వేరియంట్స్ కూడా వస్తుంది.

ఈ ఫోన్ డ్యూయల్ 48MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 18MP సెంటర్ స్టేజ్ సెల్ఫీ కెమెరా తో వస్తుంది. ఇది 4K Dolby Vision వీడియో రికార్డింగ్, లేటెస్ట్ యాపిల్ కెమెరా ఫీచర్స్ మరియు ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో దాదాపు 30 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ టైమ్ అందించే బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ మరియు 25W MagSafe అండ్ Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇది IP68 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, ఎమర్జెన్సీ శాటిలైట్ SOS మరియు క్రాష్ డిటెక్షన్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :