MIVI One 5G launched at unbelievable price in india market
MIVI One 5G: చాలా కాలంగా ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ వేరబుల్ అండ్ ఆడియో ప్రొడక్ట్స్ బ్రాండ్ గా మంచి గుర్తింపు పొందిన హైదరాబాద్ బెస్ట్ కంపెనీ మివి, ఇప్పుడు మొబైల్ మార్కెట్ లోకి కూడా అడుగుపెట్టింది. అడుగు పెట్టడమే కాకుండా మార్కెట్ ని షేక్ చేసే ప్రైస్ తో తన ఫస్ట్ 5G ఫోన్ లాంచ్ చేసింది. మివి వన్ 5జి పేరుతో మివి లాంచ్ చేసిన ఈ ఫోన్ ప్రస్తుతం భారీగా పెరిగిన స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో అతి చవక ఫోన్ గా వచ్చింది.
మివి ఈ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ మూడు వేరియంట్ ప్రైస్ లిస్ట్ ఇక్కడ చూడొచ్చు.
ఈ ఫోన్ ను బ్లూ, బర్గండి, డార్క్ బ్లూ, గ్రీన్ మరియు పింక్ తో సహా మొత్తం 5 రంగుల్లో ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ అక్టోబర్ 8వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
మివి ఈ ఫోన్ పై రెండు బెస్ట్ లాంచ్ డీల్స్ అనౌన్స్ చేసింది. అవేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ మరియు రూ. 1,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ ను Axis, HDFC, ICICI మరియు SBI క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 11,999 రూపాయల ప్రారంభ ధరలో లభిస్తుంది.
Also Read: Flipkart BBD Sale సేల్ నుంచి 12 వేలకే 5.2.4 Dolby Atmos సౌండ్ డీల్ మిస్ చేసుకోకండి.!
మివి ఈ ఫోన్ ను 6.75 ఇంచ్ LCD స్క్రీన్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ స్క్రీన్ HD +రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ని Snapdragon 4 Gen 2 బడ్జెట్ 5జి సీపీ సెట్ తో లాంచ్ చేసింది. ఇందులో 4GB, 6GB మరియు 8GB ర్యామ్ ఆప్షన్ తో జతగా 128GB స్టోరేజ్ ఆప్షన్ ని ఆఫర్ చేసింది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అయ్యింది మరియు ఇది క్లీన్ ఆండ్రాయిడ్ తో వస్తుంది. ఇందులో బ్లోట్ వేర్ లేదని కంపెనీ తెలిపింది మరియు ఇది ఆండ్రాయిడ్ 18 అప్‌డేట్ వరకు అందుకుంటుందని, మివి తెలిపింది.
కెమెరా విభాగంలో, ఈ ఫోన్ లో వెనుక 50MP మెయిన్ కెమెరా జతగా మరో సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ AI కెమెరా ఫీచర్స్ తో పాటు FHD రికార్డింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ లో 6000 mAh బిగ్ బ్యాటరీని అందించింది. అలాగే, ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ని కూడా అందించింది.