మీ Smart TV మిమ్మల్ని ట్రాక్ చేస్తుందని మీకు తెలుసా .. ఎలా ఆపాలంటే.!

HIGHLIGHTS

ప్రస్తుత కాలంలో Smart TV లు ప్రతి ఇంట్లో ఒక భాగంగా మారిపోయాయి

మీ స్మార్ట్ టీవీ మిమ్మల్ని ట్రాక్ చేస్తుందని మీకు తెలియక పోవచ్చు

ట్రాక్ చేయకుండా చేయాలంటే కొన్ని చిన్న టిప్స్ పాటించాలి

ప్రస్తుత కాలంలో Smart TV లు ప్రతి ఇంట్లో ఒక భాగంగా మారిపోయాయి. నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, OTT యాప్స్, వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్స్ వల్ల టీవీలు మరింత స్మార్ట్ గా మారాయి. కానీ చాలా మందికి తెలియని అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ స్మార్ట్ టీవీ మీ కంటెంట్ వాచింగ్ అలవాట్లు, సెర్చ్ హిస్టరీ, వాయిస్ కమాండ్స్ వంటి చాలా పర్సనల్ డేటా ను సేకరించే చేసే అవకాశం ఉంది. అంటే, మీ స్మార్ట్ టీవీ మిమ్మల్ని ట్రాక్ చేస్తుందని చెప్పొచ్చు. అయితే, ఇలా ట్రాక్ చేయకుండా చేయాలంటే కొన్ని చిన్న టిప్స్ పాటించాలి.

Smart TV ఏ వివరాలు ట్రాక్ చేస్తుంది?

మీరు మీ స్మార్ట్ టీవిలో ఏ సినిమాలు చూస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు, ఏ apps ఎక్కువ ఉపయోగిస్తారు మరియు వాయిస్ సెర్చ్ లో ఏమి మాట్లాడుతున్నారు అన్న సమాచారాన్ని టీవీ కంపెనీలు మరియు అడ్వార్టైజర్లు ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది.

Smart TV ఎలా ట్రాక్ చేస్తుంది?

చాలా స్మార్ట్ టీవీ లలో ACR (ఆటోమేటిక్ కంటెంట్ రికగ్నైజేషన్) అనే టెక్నాలజీ ఉంటుంది. మీరు చూస్తున్న కంటెంట్ ను గుర్తిస్తుంది మరియు మీరు చూసే వ్యూవింగ్ ప్యాట్రన్ ను అనలైజ్ చేస్తుంది. ఈ సేకరించిన డేటాని మీకు నచ్చే యాడ్స్ చూపించడానికి ఉపయోగిస్తుంది. ఇది కాకుండా కొన్ని స్మార్ట్ టీవీలు మైక్రోఫోన్ ద్వారా వాయిస్ డేటా మరియు ఇంటర్నెట్ యూసేజ్ తో పాటు యాప్స్ యాక్టివిటీ వంటి సమాచారాన్ని కూడా సేకరించే అవకాశం ఉంటుంది.

స్మార్ట్ టీవీ ట్రాక్ చేస్తే సమస్య ఏమిటి?

స్మార్ట్ టీవీ ట్రాక్ చేస్తే ప్రైవసీ సమస్యలు వచ్చే రావచ్చు. ముఖ్యంగా, మిమ్మల్ని టార్గెట్ చేసే యాప్స్ పెరుగుతాయి. ఇది కాకుండా మీ పర్సనల్ టీవీ వ్యూవింగ్ అలవాట్లు కంపెనీ వద్ద స్టోర్ అవుతాయి. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం హ్యాక్డ్ స్మార్ట్ డివైజెస్ ద్వారా cyber risks కూడా ఉండొచ్చు.

Also Read: Soundbar Buying Guide: మీ ఇంటికి తగిన సౌండ్ బార్ ఎలా ఎంచుకోవాలి.!

మీ స్మార్ట్ టీవీ ట్రాకింగ్ ఆపడానికి ఏమి చేయాలి?

దీనికోసం ముందుగా మీ స్మార్ట్ టీవీ సెట్టింగ్స్ లోకి వెళ్లి ACR ఫీచర్ ను ఆఫ్ చేయండి. దీనికోసం టీవీ సెట్టింగ్స్ లోకి వెళ్లి ప్రైవసీ లోకి వెళ్ళండి. ఇందులో యూజర్ అగ్రిమెంట్ లో ఉన్న వ్యూవింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ లోకి అక్కడ ఉన్న ఆప్షన్స్ లో ACR ను ఆఫ్ చేయండి. అయితే, టీవీ బ్రాండ్ ను బట్టి ఈ పేరు మారవచ్చు.

  • Samsung – వ్యూవింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్
  • LG – లైవ్ ప్లస్
  • Sony – Samba Interactive TV
  • TCL – Smart TV Experience

బ్రాండ్ ను బట్టి ఇలా సర్వీస్ పేరు లో మార్పు ఉంటుంది.

వాయిస్ కంట్రోల్ ఆఫ్ చేయండి

ఇక వాయిస్ కంట్రోల్ విషయానికి వస్తే, వాయిస్ కంట్రోల్ ఫీచర్ ను ఉపయోగించకపోతే OFF చేయడం మంచిది. అంటే, గూగుల్ అసిస్టెంట్, అలెక్సా మరియు టీవీ మైక్రోఫోన్ యాక్సెస్ ను డిసేబుల్ చేయండి. ఇలా మీ స్మార్ట్ టీవీ మిమ్మల్ని ట్రాక్ చేయకుండా చేసే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :