Xiaomi ప్రీమియం QLED Smart Tv పై బిగ్ డిస్కౌంట్ అందించిన షియోమీ.!
Xiaomi ప్రీమియం QLED Smart Tv పై షియోమీ జబర్దస్త్ డీల్స్ అందించింది
లేటెస్ట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ లపై ఈ జబర్దస్త్ డీల్స్ అందించింది
ఈ టీవీ Dolby Vision, HDR 10 మరియు HLG తో గొప్ప విజువల్స్ అందిస్తుంది
Xiaomi ప్రీమియం QLED Smart Tv పై షియోమీ జబర్దస్త్ డీల్స్ అందించింది. గత సంవత్సరం ఆగస్టు నెలలో విడుదలైన లేటెస్ట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ లపై ఈ జబర్దస్త్ డీల్స్ అందించింది. ఇండియన్ మార్కెట్ లో గొప్ప ఫీచర్స్ తో 50 వేల బడ్జెట్ లో విడుదలైన 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని ఇప్పుడు షియోమీ ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం 44 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకోవచ్చు.
SurveyXiaomi QLED Smart Tv : ఆఫర్స్
ఇండియన్ మార్కెట్లో షియోమీ రీసెంట్ గా విడుదల చేసిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ 4K X Pro సిరీస్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఈ డీల్స్ అందించింది. ఈ సిరీస్ నుంచి 55 ఇంచ్ స్మార్ట్ టీవీని రూ. 49,999 ధరతో గత సంవత్సరం షియోమీ లాంచ్ చేసింది. అయితే, ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీ పై రూ. 3,000 రూపాయల తగ్గింపు అందించింది రూ. 46,999 రూపాయల ఆఫర్ ధరకే అందిస్తోంది.
అంతేకాదు, ఈ బిగ్ షియోమీ స్మార్ట్ టీవీ పై గొప్ప ఆఫర్స్ కూడా అందించింది. ఈ టీవీని xiaomi.com నుంచి ICICI బ్యాంక్ కార్డ్స్ EMI ఆఫర్ తో కొనే వారికి రూ. 2,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ పై Snapmint 0% వడ్డీ ఆప్షన్ ను కూడా అందించింది. ఈ స్మార్ట్ టీవీని అమెజాన్ నుంచి ICICI మరియు SBI క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీని రూ. 44,999 రూపాయల ఆఫర్ ధరకు అందుకోవచ్చు. Buy From Here
Also Read: Flipkart Sale చివరి రోజు జెబ్రోనిక్స్ 5.1 Soundbar పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!
Xiaomi QLED Smart Tv : ఫీచర్స్
ఈ షియోమీ స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 55 ఇంచ్ QLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Vision, HDR 10, HLG మరియు వివిద్ పిక్చర్ ఇంజన్ 2 తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ A55 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2GB ర్యామ్ మరియు భారీ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ షియోమీ స్మార్ట్ టీవీ Dolby Audio, DTS-X మరియు DTS Virtual: X సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కలిగిన 30W స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ ALLM, HDMI eARC, USB, బ్లూటూత్ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
