Flipkart Sale చివరి రోజు జెబ్రోనిక్స్ 5.1 Soundbar పై ధమాకా ఆఫర్స్ ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ ఇటీవల ప్రకటించిన బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ ను ఆఫర్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ సేల్ చివరి రోజు అందించిన గొప్ప డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను 5 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకోవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
Flipkart Sale 5.1 Soundbar ఆఫర్
ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్ నుంచి ఈరోజు జెబ్రోనిక్స్ Juke Bar 7450 PRO సౌండ్ బార్ పై 71% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ దెబ్బకి ఈ సౌండ్ బార్ కేవలం రూ. 5,999 రూపాయల ధరకే సేల్ అవుతోంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 599 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 5,400 రూపాయల అతి తక్కువ రేటుకే సొంతం చేసుకోవచ్చు.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ ను కలిగి ఉంటుంది. అంటే, ఇందులో ట్రిపుల్ ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ రియర్ శాటిలైట్ స్పీకర్లు మరియు సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ మొత్తంగా 200W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇది ఒక మీడియం సైజు హాల్ లేదా పెద్ద బెడ్ రూమ్ కు సరిపోతుంది మరియు మంచి సౌండ్ అందిస్తుంది.
ఈ జేబీరోనిక్స్ సౌండ్ బార్ HDMI Arc, USB, AUX మరియు లేటెస్ట్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ లో Dolby లేదా DTS సౌండ్ సపోర్ట్ లేకపోవడం పెద్ద లోటుగా చెప్పవచ్చు. అయితే, ఈ సౌండ్ బార్ మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ సౌండ్ బార్ కొనుగోలు చేసిన యూజర్ల నుంచి మంచి రివ్యూలను మరియు రేటింగ్ ను అందుకుంది.