Redmi Smart TV X43: బడ్జెట్ ధరలో వచ్చిన Redmi కొత్త స్మార్ట్ టీవీ
Redmi Smart TV X43 టీవీ 4K రిజల్యూషన్ తో వచ్చింది
X సిరీస్ నుండి 43 ఇంచ్ సైజులో తీసుకొచ్చింది
ఈ టీవీ Dolby Vision, HDR 10+ మరియు HDR 10 కు సపోర్ట్ చేస్తుంది
Xiaomi ఈరోజు ఇండియాలో చాలా ప్రోడక్ట్స్ ను ప్రకటించింది. ఇందులో Redmi Smart TV X43 టీవీ కూడా ఒకటి. ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ ఇంతకు ముందు నుండే అందుబాటులో వున్న స్మార్ట్ టీవీ X సిరీస్ నుండి 43 ఇంచ్ సైజులో తీసుకొచ్చింది. అయితే, ఈ స్మార్ట్ టీవీ Dolby Vision మరియు Dolby Audio సపోర్ట్ తో వచ్చింది. ఈరోజే ఇండియన్ మార్కెట్లొకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ గురించిన వివరాలను గురించి చూద్దామా.
SurveyRedmi Smart TV X43: ధర
ఈ లేటెస్ట్ రెడ్ మీ స్మార్ట్ టీవీ 43-ఇంచ్ సైజులో 4K రిజల్యూషన్ తో వచ్చింది. వాస్తవానికి, ఈ సిరీస్ నుండి ఇప్పటికే 50, 55 మరియు 65 ఇంచ్ సైజులో స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉండగా ఈ 43 ఇంచ్ స్మార్ట్ టీవీని ఇందులో జతచేసింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీని రూ.28,999 రూపాయల ధరతో విడుదల చేసింది. ఈ టీవీ అమెజాన్ మరియు xiaomi అధికారిక వెబ్సైట్ నుండి లభిస్తుంది.
Redmi Smart TV X43:స్పెక్స్
ఇక ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీల ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ మంచి వ్యూవింగ్ ఎక్స్ పీరియన్స్ మరియు క్రిస్పీ కలర్స్ అందించడానికి Vivid Picture Engine కలిగివుంది మరియు 92% DCI-P3 కలర్ గ్యాముట్ తో వస్తుంది. ఈ టీవీ Dolby Vision, HDR 10+ మరియు HDR 10 కు సపోర్ట్ చేస్తుంది.
అలాగే, మంచి సౌండ్ అందించడానికి Dolby Audio, DTS-HD మరియు DTS Virtual:X సౌండ్ టెక్నాలజీ కి సపోర్ట్ చేసే 30W సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తుంది. అంతేకాదు, eARC పోర్ట్ ద్వారా కనెక్ట్ చేస్తే Dolby Atmos కి కూడా సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది.
అలాగే కనెక్టివిటీ పరంగా, eArc సపోర్ట్ తో మొత్తం 3HMDI పోర్ట్స్ ఉన్నాయి మరియు 2USB పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇది బ్లూటూత్ 5.0 కి మద్దతునిస్తుంది మరియు ఇథెర్నెట్ పోర్ట్, ఆప్టికల్, Wi-Fi సపోర్ట్ వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్స్ ని కలిగివున్నాయి. ఈ టీవీ షియోమి యొక్క Patchwall4 UI మరియు Android Tv 10 OS తో పనిచేస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile