భారీ ఆఫర్లతో OnePlus లేటెస్ట్ స్మార్ట్ టీవీల సేల్
TV Y1S మరియు Y1S Edge స్మార్ట్ టీవీల అమ్మకాలు రేపటి నుండి మొదలవుతాయి
ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీలు గామా ఇంజిన్ తో HDR 10, HDR 10+ సపోర్ట్ తో వచ్చాయి
ఈ స్మార్ట్ టీవీలు ఆండ్రాయిడ్ 11OS తో నడస్తాయి
వన్ ప్లస్ ఇటీవల ఇండియాలో ప్రకటించిన TV Y1S మరియు Y1S Edge స్మార్ట్ టీవీల అమ్మకాలు రేపటి నుండి మొదలవుతాయి. ఈ లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ టీవీలు గామా ఇంజిన్ తో HDR 10, HDR 10+ సపోర్ట్ తో వచ్చాయి. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీలు ఆండ్రాయిడ్ 11OS తో నడస్తాయి. ఈ TV Y1S మరియు Y1S Edge రెండు వేరియంట్స్ మధ్య వ్యతాసం సౌండ్ అవుట్ పుట్ వాట్స్ మరియు TUV Rheinland సర్టిఫైడ్ డిస్ప్లే మాత్రమే.
Surveyవన్ ప్లస్ Tv Y1s సిరీస్ నుండి రెండు కొత్త స్మార్ట్ టీవీవేరియంట్ లను ప్రకటించింది. ఈ స్మార్ట్ టీవీలను 32 మరియు 43 ఇంచ్ సైజులో అందించింది. ఇందులో 32 ఇంచ్ టీవీ HD Ready స్మార్ట్ టీవీ కాగా, 43 ఇంచ్ టీవీ FHD రిజల్యూషన్ తో వస్తుంది. పైన తెలిపిన విధంగా ఇదే ప్రత్యేకతలతో Y1S Edge అందించింది. ఈ రెండు వేరియంట్ మద్య కేవలం రెండు తేడాలు మాత్రమే ఉన్నాయి. ఈ టీవీలు అమెజాన్ మరియు వన్ ప్లస్ అధికారిక వెబ్సైట్ నుండి లభిస్తాయి
Oneplus TV Y1S: ధర
Oneplus TV Y1S (32) HD రెడీ స్మార్ట్ టీవీ ధర: రూ.16,499
Oneplus TV Y1S (43) FHD స్మార్ట్ టీవీ ధర: రూ.26,999
Oneplus TV Y1S Edge (32) HD రెడీ స్మార్ట్ టీవీ ధర: రూ.16,999
Oneplus TV Y1S Edge (43) FHD స్మార్ట్ టీవీ ధర: రూ.27,999
ఫిబ్రవరి 21 నుండి ఈ స్మార్ట్ టీవీల సేల్ మొదలవుతుంది. ఈ స్మార్ట్ టీవీలను Axis బ్యాంక్ యొక్క తక్షణ డిస్కౌంట్ అఫర్ తో అందించింది. Axis బ్యాంక్ కార్డ్స్ మరియు EMI తో TV Y1S సిరీస్ స్మార్ట్ టీవీలను కొనేవారికి భారీ ఇన్స్టాంట్ డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది. TV Y1S టీవీల పైన 2,000 రూపాయల డిస్కౌంట్ ను , Y1S Edge టీవీల పైన 2,500 రూపాయల భారీ డిస్కౌంట్ ను ఈ అఫర్ ద్వారా పొందవచ్చు.
Oneplus TV Y1S: ఫీచర్లు
ఈ లేటెస్ట్ వన్ ప్లస్ TV Y1S సిరీస్ ఫీచర్ల విషయానికి వస్తే, 32 ఇంచ్ స్మార్ట్ టీవీ HD రెడీ (1366×768) రిజల్యూషన్ తో వస్తే, 43 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ (1920×1080) రిజల్యూషన్ తో ఉంటుంది. ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా గామా ఇంజిన్ తో HDR 10, HDR 10+ సపోర్ట్ ను కలిగి ఉంటాయని కంపెనీ తెలిపింది. TV Y1S రెండు స్మార్ట్ టీవీలు కూడా Dolby Audio సౌండ్ టెక్నాలజీ కలిగివుంటాయి మరియు 20W సౌండ్ అవుట్ పుట్ ని అందిస్తాయి. TV Y1S Edge టీవీలు మాత్రం 24W సౌండ్ అవుట్ పుట్ తో వస్తాయి మరియు అలాగే, TUV Rheinland సర్టిఫైడ్ డిస్ప్లేతో వస్తాయి.
ఇక ఈ స్మార్ట్ టీవీల ఆపరేటింగ్ సిస్టమ్ మరియు ఇతర ఫీచర్ల గురించి చూస్తే, ఈ వన్ ప్లస్ రెండు స్మార్ట్ టీవీలు కూడా Android 11 OS తో పనిచేస్తాయి. ఈ టీవీలకు బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్ మరియు అలెక్సాతో వంటి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా వుంది. ఈ టీవీలు 3HMDI (1HDMI Arc) మరియు 2 USB మరియు 1 ఆప్టికల్ పోర్టులను కలిగివుంది. ఈ టీవీలు 1GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్, మీరా క్యాస్ట్, Wi Fi మరియు బ్లూటూత్ 5.0 తో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile