Motorola QD Mini LED స్మార్ట్ టీవీ ఈరోజు కేవలం బడ్జెట్ ధరలో లభిస్తోంది.!
బడ్జెట్ ధరలో ప్రీమియం స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న కొనుగోలుదారులకు గుడ్ న్యూస్
Motorola QD Mini LED స్మార్ట్ టీవీ ఈరోజు కేవలం బడ్జెట్ ధరలో లభిస్తోంది
ఈరోజు ఈ స్మార్ట్ టీవీ కేవలం LED స్మార్ట్ టీవీ రేటుకే మీకు లభిస్తుంది
బడ్జెట్ ధరలో ప్రీమియం స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. Motorola QD Mini LED స్మార్ట్ టీవీ ఈరోజు కేవలం బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ గొప్ప విజువల్స్ అందించే గొప్ప స్క్రీన్ మరియు మంచి సౌండ్ అందించే స్పీకర్ సెటప్ కూడా కలిగి ఉంటుంది. ఈరోజు ఈ స్మార్ట్ టీవీ కేవలం LED స్మార్ట్ టీవీ రేటుకే మీకు లభిస్తుంది. మరి ఈ రోజు అందుబాటులో ఉన్న ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేద్దామా.
SurveyMotorola QD Mini LED స్మార్ట్ టీవీ: డీల్
ఇక ఈ మోటోరోలా స్మార్ట్ టీవీ డీల్ విషయానికి వస్తే మోటోరోలా యొక్క 55 ఇంచ్ క్యూడి మినీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ మోడల్ (55UHDGMMWKRQ) ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు ప్రకటించిన 56% భారీ డిస్కౌంట్ తో ఈ టీవీ కేవలం రూ. 32,999 రూపాయల అతి చవక ధరలో లభిస్తోంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో సాధారణ టీవీలు మాత్రమే లభిస్తుంది. కానీ, ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు మీకు మోటోరోలా 55 ఇంచ్ క్యూడి మినీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ లభిస్తుంది.
Motorola QD Mini LED స్మార్ట్ టీవీ: ఫీచర్స్
ఈ మోటోరోలా స్మార్ట్ టీవీ 55 ఇంచ్ పరిమాణం కలిగిన క్యూడి మినీ ఎల్ఈడీ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ టీవీ 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 160 లోకల్ డిమ్మింగ్ జోన్స్, డాల్బీ విజన్ మరియు HDR 10 వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఇది మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ కలిగి ఉంటుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ అండ్ 16 జీబీ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ మోటోరోలా స్మార్ట్ టీవీ లేటెస్ట్ ఆండ్రాయిడ్ OS తో నడుస్తుంది.

ఇక ఈ మోటోరోలా 55 ఇంచ్ స్మార్ట్ టీవీ సౌండ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డాల్బీ అట్మోస్ మరియు సరౌండ్ సౌండ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ టీవీ డ్యూయల్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 20W సౌండ్ అందిస్తుంది. ఇందులో RF, LAN, HDMI, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.
Also Read: Lava Bold N1 5G: బడ్జెట్ యూజర్ ను ఆకట్టుకునే ప్రైస్ అండ్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
ఈ మోటోరోలా 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.4 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile