Lava Bold N1 5G: బడ్జెట్ యూజర్ ను ఆకట్టుకునే ప్రైస్ అండ్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
లావా ఇండియాలో మరో బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది
Lava Bold N1 5G ను ఆకట్టుకునే ప్రైస్ అండ్ ఫీచర్స్ తో అందించింది
ఈ ఫోన్ క్యాంపెన్ గోల్డ్ మరియు రాయల్ బ్లూ రెండు రంగుల్లో లభిస్తుంది
Lava Bold N1 5G: చైనా మొబైల్ కంపెనీలకు ధీటుగా స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తున్న ప్రముఖ ఇండియన్ మొబైల్ బ్రాండ్ లావా, ఇండియాలో మరో బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే లావా బోల్డ్ ఎన్ 1 5జి స్మార్ట్ ఫోన్ బడ్జెట్ యూజర్ ను ఆకట్టుకునే ప్రైస్ అండ్ ఫీచర్స్ తో అందించింది.
SurveyLava Bold N1 5G: ప్రైస్
లావా బోల్డ్ ఎన్ 1 5జి స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 12,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ రెండో వేరియంట్ కూడా ఉంటుంది. అంతేకాదు, లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ పై రూ. 1,000 విలువైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది. అయితే, ఈ ఆఫర్స్ మే 1వ జరిగే ఈ ఫోన్ మొదటి సేల్ రోజు మాత్రమే లభిస్తాయి. ఈ ఫోన్ క్యాంపెన్ గోల్డ్ మరియు రాయల్ బ్లూ రెండు రంగుల్లో లభిస్తుంది.
Lava Bold N1 5G: ఫీచర్స్
లావా ఈ ఫోన్ ను చాలా స్లీక్ అండ్ స్టైలిష్ డిజైన్ లో అందించింది. ఈ ఫోన్ 6.75 ఇంచ్ HD+ LCD స్క్రీన్ ను 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Unisoc T765 ఆక్టా కోర్ 5జి చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇందులో 4 జీబీ మరియు 6 జీబీ ర్యామ్ ఆప్షన్ తో జతగా అదే 4 జీబీ మరియు 6 జీబీ వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ 64 జీబీ మరియు 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ కలిగి ఉంటుంది. లావా బోల్డ్ ఎన్ 1 5జి స్మార్ట్ ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ 15 OS పై నడుస్తుంది.

ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక 13MP AI డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. అయితే, ఇది 30FPS వద్ద 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది. అలాగే ఈ ఫోన్ లో ముందు 5MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్లోమోషన్ మరియు టైమ్ లాప్స్ వంటి మరిన్ని కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: ఈరోజు రూ. 5,000 ధరలో పవర్ ఫుల్ Dolby Soundbar డీల్స్ అందించిన ఫ్లిప్ కార్ట్.!
ఇతర ఫీచర్స్ పరంగా, ఈ ఫోన్ లో 5000mAh పెద్ద బ్యాటరీని లావా అందించింది. అయితే, ఈ ఫోన్ ను 10W ఛార్జ్ సపోర్ట్ మాత్రమే అందించింది. ఈ ఫోన్ లో ఫేస్ అన్లాక్ మరియు సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉన్నాయి. ఈ లావా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ IP54 రేటింగ్ డస్ట్ అండ్ స్ప్లాష్ ప్రొటెక్షన్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ తో కూడా ఉచిత హోమ్ సర్వీస్ ను లావా ఆఫర్ చేస్తోంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile