మార్చి నెల చివరి రోజుల్లో మంచి ఆఫర్స్ తో కొత్త టీవీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈరోజు ఒక గొప్ప స్మార్ట్ టీవీ డీల్ యూజర్ల కోసం అందుబాటులో ఉంది. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ LG OLED Smart Tv పై ఈ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ టీవీ పై ఈరోజు రూ. 15,000 భారీ డిస్కౌంట్ అందుకోవచ్చు. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ ఈరోజు బ్యాంక్ ఆఫర్స్ తో కూడా లభిస్తుంది. OLED టీవీ లకు పెట్టింది పేరైన LG బ్రాండ్ యొక్క ఓలెడ్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారు ఈ డీల్ ను పరిశీలించవచ్చు. మరి ఈ రోజు అందుబాటులో ఉన్న ఈ డీల్ పై ఒక లుక్కేయండి.
Survey
✅ Thank you for completing the survey!
LG OLED Smart Tv : డీల్
ఎల్ జి OLED A3 సిరీస్ నుంచి అందించిన 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఈ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అదేమిటంటే, 2023 లో రూ. 94,990 ధరతో ఎల్ జి లాంచ్ చేసిన 55 ఇంచ్ ఓలెడ్ స్మార్ట్ టీవీ ఇప్పుడు రూ. 15,000 భారీ తగ్గింపు అందుకుని రూ. 79,990 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ రెండు సైట్ లలో ఇదే రేటుకు లభిస్తుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు. ఈ ఆఫర్స్ కోసం Click Here
ఈ ఎల్ జి ఓలెడ్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840×2160) రిజల్యూషన్ కలిగిన OLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Vision IQ, HDR 10 మరియు HLG సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ ఓలెడ్ టీవీ α7 AI Processor 4K Gen6 తో పని చేస్తుంది మరియు జతగా 2GB RAM తో పాటు 8 GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 10 సీన్ మోడ్స్ కలిగి ఉంటుంది మరియు మ్యాజిక్ రిమోట్ తో వస్తుంది.
ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ 20W సౌండ్ అందించే 2.0 ఛానల్ సెటప్ తో వస్తుంది. అయితే, ఈ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ మరియు AI Sound Pro సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వర్చువల్ 5.1.2 అప్ మిక్స్ సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ 3 HDMI (eArc), 2USB, బ్లూటూత్, ఆప్టికల్, ఈథర్నెట్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.