LG 55 Nano Smart Tv available at all time best price from amazon great freedom sale
LG 55 Nano Smart Tv అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నుంచి ఆల్ టైమ్ బెస్ట్ ప్రైస్ లో లభిస్తోంది. ఎల్ జి లేటెస్ట్ గా విడుదల చేసిన 2026 మోడల్ నానో స్మార్ట్ టీవీని ఈ ధరలో అందించడం నిజంగా హర్షించదగిన విషయం అవుతుంది. ఎందుకంటే, ఈ టీవీ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి 7 వేల రూపాయల తగ్గింపు ధరలో లభిస్తోంది.
అమెజాన్ ఇండియా ఈరోజు గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నుంచి ఎల్ జి లేటెస్ట్ 55 ఇంచ్ నానో స్మార్ట్ టీవీ 55NU870BPLA 2026 మోడల్ పై రూ. 5,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందించింది. అందుకే, నిన్న మొన్నటి వరకు రూ. 47,999 ధరతో సేల్ అయిన ఈ టీవీ ఈ రోజు రూ. 42990 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది.
ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీపై రూ. 2,000 భారీ All banks క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. అంటే, ఈ ఎల్ జి స్మార్ట్ టీవీని ఏదైనా బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ రూ. 40,990 రూపాయల ఆఫర్ ధరలో మీకు అమెజాన్ సేల్ నుంచి లభిస్తుంది. ఈ ఆఫర్ ధరలో ఈ టీవీ అమెజాన్ సేల్ నుంచి కొనుగోలు చేయాలనుకునే వారు Buy From Here లింక్ పై క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు.
Also Read : Sony 4K Smart Tv ఇంత చవక ధరలో లభిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు .. ఆఫర్ ప్రైస్ అదిరింది.!
ఎల్ జి లేటెస్ట్ 55 ఇంచ్ నానో స్మార్ట్ టీవీ 55NU870BPLA 2026 మోడల్ α7 AI Processor 4K Gen9 స్మార్ట్ ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఇది ఈ టీవీని చాలా స్మార్ట్ గా మరియు సమర్ధవంతంగా నడిపిస్తుంది. ఇందులో 1.5GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈ టీవీ నానో స్క్రీన్ ను 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ డైనమిక్ టోన్ మ్యాపింగ్, AI HDR రీ మాస్టరింగ్, HDR10, HLG, 4K సూపర్ అప్ స్కేలింగ్ మరియు ప్రెసిషన్ HDR మాస్టర్ ప్రో వంటి ఫీచర్స్ తో జబర్దస్త్ విజువల్స్ అందిస్తుంది.
ఈ టీవీ AI చాట్ బాట్, AI వాయిస్ ఐడి, ఫుల్ వెబ్ బ్రౌజర్ మరియు మరిన్ని ఏఐ ఫీచర్స్ తో వస్తుంది. ఇందులో రెండు 10W స్పీకర్లు ఉంటాయి. అయితే, ఈ టీవీ AI సౌండ్ ప్రో (Virtual 9.1.2 Up-mix) ఫీచర్ మరియు డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో బిల్ట్ ఇన్ Wi Fi, బ్లూటూత్, HDMI, USB, LAN మరియు ఆప్టికల్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి. ఇది LG ThinQ, గూగుల్ క్రోమ్ క్యాస్ట్, గేమ్స్ సర్వీస్ మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.