TCL 55 ఇంచ్ QLED Smart Tv ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది.!

HIGHLIGHTS

TCL 55 ఇంచ్ QLED Smart Tv ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో మంచి బడ్జెట్ ధరలో లభిస్తుంది

జబర్దస్త్ సౌండ్ అందించే Onkyo స్పీకర్ సెటప్ కలిగిన లేటెస్ట్ టిసిఎల్ టీవీ ఆఫర్

ఈ ఆఫర్ ధరలో ఈ టీవీ గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది

TCL 55 ఇంచ్ QLED Smart Tv ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది.!

TCL 55 ఇంచ్ QLED Smart Tv ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో మంచి బడ్జెట్ ధరలో లభిస్తుంది. మంచి విజువల్స్ అందించే క్యూలెడ్ స్క్రీన్ మరియు జబర్దస్త్ సౌండ్ అందించే Onkyo స్పీకర్ సెటప్ కలిగిన లేటెస్ట్ టిసిఎల్ టీవీ ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. ఈ టీవీ పై అమెజాన్ అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ బిగ్ టీవీ తక్కువ ధరలో లభిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

TCL 55 QLED Smart Tv : ఆఫర్

టిసిఎల్ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ 55T8C మోడల్ పై అమెజాన్ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. మొదట ఈ టీవీ పై 65% భారీ డిస్కౌంట్ అందించి రూ. 37,990 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ చేసింది. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 3,000 రూపాయల అదనపు డిస్కౌంట్ అందించింది.

TCL 55 QLED Smart Tv deal on amazon

ఈ రెండు ఆఫర్లు కాకుండా ఈ టీవీ పై రూ. 2,000 రూపాయల అదనపు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ మూడు ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 32,990 రూపాయల డిస్కౌంట్ ధరలో మీకు లభిస్తుంది. ఈ ఆఫర్ ధరలో ఈ టీవీ గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది. Buy From Here

Also Read: ఫ్లిప్ కార్ట్ బిగ్ డిస్కౌంట్ తో 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ 15 వేల బడ్జెట్ లోనే లభిస్తోంది.!

TCL 55 QLED Smart Tv : ఫీచర్స్

ఈ టిసిఎల్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ పరిమాణం కలిగిన క్యూలెడ్ స్క్రీన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ AiPQ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 3 జీబీ ర్యామ్ మరియు 32 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీ 4K HDR Pro, HDR 10, డాల్బీ విజన్ మరియు బయోనిక్ కలర్ ఆప్టిమైజేషన్ తో రియల్ వరల్డ్ కలర్స్ ను కళ్ళ ముందు తీసుకొస్తుందని కంపెనీ తెలిపింది.

ఈ స్మార్ట్ టీవీ మెటాలిక్ డిజైన్ తో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ టీవీలో ప్రముఖ స్పీకర్ కంపెనీ Onkyo స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 35W సౌండ్ అందిస్తుంది. అదనంగా, ఈ స్మార్ట్ టీవీ కలిగిన డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది. ఇందులో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB, ఆప్టికల్, ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo