Matrix సిరీస్ నుంచి బడ్జెట్ ధరలో మూడు కొత్త QLED Smart Tv లు లాంచ్ చేసిన Kodak

ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Kodak Matrix సిరీస్ నుంచి బడ్జెట్ ధరలో మూడు కొత్త QLED Smart Tv లు లాంచ్ చేసింది. ఈ సిరీస్ నుంచి 32 ఇంచ్, 40 ఇంచ్ మరియు 43 ఇంచ్ మూడు సైజుల్లో టీవీలు లాంచ్ చేసింది. ఈ టీవీ లను డాల్బీ సౌండ్ మరియు స్లీక్ బెజెల్స్ డిజైన్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేసింది. బడ్జెట్ యూజర్ ను టార్గెట్ చేసి కొడాక్ లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.

Kodak Matrix QLED Smart Tv : ధర

కొడాక్ కొత్తగా విడుదల చేసిన మూడు టీవీల ప్రైస్ వివరాలు ఈ క్రింద చూడవచ్చు.

  • 32 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ప్రైస్ : రూ. 10,999
  • 40 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ప్రైస్ : రూ. 15,999
  • 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ప్రైస్ : రూ. 16,999

ఈ మూడు స్మార్ట్ టీవీలు కూడా ఫ్లిప్ కార్ట్ మరియు ShopSSPL వెబ్సైట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తాయి. ఈ స్మార్ట్ టీవీల పై మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా కొడాక్ అందించింది.

Also Read: Portable AC vs Air Cooler: మీ గదికి ఏది బెస్ట్ మరియు మీకు ఏది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.!

Kodak Matrix QLED Smart Tv : ఫీచర్స్

కొడాక్ కొత్తగా అందించిన మూడు టీవీలలో 32 ఇంచ్ టీవీ HD Ready రిజల్యూషన్ మరియు 40 ఇంచ్ మరియు 43 ఇంచ్ టీవీలు FHD రిజల్యూషన్ కలిగి ఉంటాయి. అయితే, ఈ మూడు స్మార్ట్ టీవీలు కూడా 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటాయి. ఈ టీవీలను లేటెస్ట్ గూగుల్ టీవీ 5.0 ఆపరేటింగ్ సిస్టం తో కొడాక్ లాంచ్ చేసింది. ఈ మూడు క్యూలెడ్ స్మార్ట్ టీవీలు కూడా ఐకేర్ టెక్నాలజీ కలిగి ఉంటాయి. ఈ మూడు టీవీలు కూడా లేటెస్ట్ ai క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటాయి.

ఈ మూడు టీవీలు కూడా టోటల్ 40W హెవీ సౌండ్ అందించే డ్యూయల్ స్పీకర్ సిస్టం కలిగి ఉంటాయి. అంతేకాదు, 32 ఇంచ్, 40 ఇంచ్ మరియు 43 ఇంచ్ మూడు టీవీలలో కూడా డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ను కూడా కొడాక్ ఆఫర్ చేసింది. ఈ టీవీలు 600 కంటే ఎక్కువ ఉచిత ఛానల్స్ యాక్సెస్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ మరియు వివిధ కలర్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీలలో బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్, HDMI పోర్ట్, USB పోర్ట్ AV in వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :