Jio New Offer jio ott pass launched with 15 ott access and more benefits
Jio New Offer: టెలికాం రంగంలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు మరింత విలువైన సేవలు అందించేందుకు జియో కొత్త ఆఫర్ ను ప్రకటించింది. ఈ ప్రత్యేకమైన కొత్త ఆఫర్ ద్వారా OTT పాస్ లను అందిస్తోంది. ఈ కొత్త ఆఫర్ తో మొబైల్ డేటాతో పాటు 15 ప్రముఖ OTT ప్లాట్ ఫామ్స్ సబ్ స్క్రిప్షన్ ను కూడా సింగల్ రీచార్జ్‌లో పొందే అవకాశం అందించింది. జియో యూజర్ల కోసం ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో అందించిన ఈ జియో కొత్త ఆఫర్ ఏమిటో ఒక లుక్కేద్దామా.
రిలయన్స్ జియో యూజర్ల కోసం కొత్తగా Jio OTT Pass ఆఫర్ ను జియో అందించింది. ఈ కొత్త ఆఫర్ ను కేవలం రూ. 200 రూపాయల రీఛార్జి తో అందించింది. అయితే, ఈ ఆఫర్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు సినిమాలు, వెబ్ సిరీస్ లు, లైవ్ స్పోర్ట్స్ మరియు టీవీ షోలను అదనపు సబ్ స్క్రిప్షన్ ఖర్చు లేకుండా వీక్షించవచే అవకాశం అందిస్తుంది.
జియో అందిస్తున్న కొన్ని OTT ప్యాక్ లలో జియో హాట్ స్టార్, Sony LIV, ZEE5, Lionsgate Play, డిస్కవరీ ప్లస్ వంటి ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీస్ యాక్సెస్ లభిస్తుంది. అయితే, వీటిని పొందడానికి విడివిడిగా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కానీ, ఈ కొత్త రూ. 200 రూపాయల జియో OTT పాస్ తీసుకుంటే వీటన్నిటికి యాక్సెస్ లభిస్తుంది.
జియో OTT పాస్ అందించే లాభాల విషయానికి వస్తే, ఈ కొత్త ఓటీటీ పాస్ తో జియో టీవీ మొబైల్ యాప్ ద్వారా Zee5, Sun NXT, జియో హాట్ స్టార్, SonyLIV, లయన్స్ గేట్ ప్లే, కంచె లంక, ప్లానెట్ మరాఠి, డిస్కవరీ ప్లస్, చౌపల్, టైమ్స్ ప్లే, Fan Code,తరంగ్ ప్లస్ మరియు Hoichoi యాప్స్ లో ఉచిత యాక్సెస్ అందిస్తుంది. అంతేకాదు, మై జియో ద్వారా యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ తో పాటు ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ యాక్సెస్ కూడా లభిస్తుంది.
ఈ ప్లాన్ కేవలం OTT లాభాలు మాత్రమే కాదు లైవ్ టీవీ ఛానల్ యాక్సెస్ కూడా అందిస్తుంది. ఈ జియో కొత్త ఒటిటి పస తో జియో టీవీ మొబైల్ యాప్ ద్వారా సన్ టీవీ నెట్ వర్క్, Warner Bros, జియో స్టార్, సోనీ ఎంటర్టైన్మెంట్ మరియు ఈటీవీ వంటి 1000 కి పైచిలుకు ఛానల్ యాక్సెస్ కూడా మీకు అందిస్తుంది. ఇవి కాకుండా, ఈ ప్లాన్ తో 30GB హై స్పీడ్ డేటా కూడా మీకు అందిస్తుంది. ఈ జియో ఓటీటీ పాస్ తో వచ్చే అన్ని ప్రయోజనాలు కూడా 28 రోజులు చెల్లుబాటు అవుతాయి.
Also Read: Sony Dolby Atmos సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో కేవలం 17 వేల ధరలో లభిస్తోంది.!
MyJio app ద్వారా జియో ఓటీటీ పాస్ ను యాక్టివేట్ చేసుకోవాలి. అంటే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసిన తర్వాత ఈ ప్లాన్ తో వచ్చే 15 OTT యాక్సెస్ ఆటోమేటిక్‌గా యాక్టివ్ చేయబడతాయి.