చవక ధరలో మూడు కొత్త QLED Smart Tv లు విడుదల చేసిన జర్మనీ కంపెనీ Blaupunkt

HIGHLIGHTS

Blaupunkt ఈరోజు ఇండియన్ మార్కెట్లో మూడు కొత్త QLED Smart Tv లను విడుదల చేసింది

ఈ టీవీలు డాల్బీ ఆడియో సపోర్ట్ తో పాటు లేటెస్ట్ గూగుల్ OS తో అందించడం విశేషం

ఈ మూడు టీవీలు కూడా లేటెస్ట్ క్వాడ్ కోర్ చిప్ సెట్ తో లాంచ్ అయ్యాయి

ప్రముఖ జర్మన్ కంపెనీ Blaupunkt ఈరోజు ఇండియన్ మార్కెట్లో మూడు కొత్త QLED Smart Tv లను విడుదల చేసింది. ఈ మూడు స్మార్ట్ టీవీలు కూడా ఆకట్టుకునే ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరతో లాంచ్ చేసింది. ఈ టీవీలు డాల్బీ ఆడియో సపోర్ట్ తో పాటు లేటెస్ట్ గూగుల్ OS తో అందించడం విశేషం. బ్లౌపంక్ట్ ఇండియన్ మార్కెట్లో సరికొత్తగా విడుదల చేసిన ఈ మూడు స్మార్ట్ టీవీ ప్రైస్ మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దామా.

Blaupunkt QLED Smart Tv : ప్రైస్

ముందుగా ఈ మూడు స్మార్ట్ టీవీ లాంచ్ చేసిన ప్రైస్ వివరాల్లోకి వెళితే, బ్లౌపంక్ట్ గూగుల్ టీవీ 2026 ఎడిషన్ నుంచి ఈ మూడు టీవీలు లాంచ్ చేసింది. ఈ మూడు టీవీల ప్రైస్ లిస్ట్ క్రింద చూడవచ్చు.

  • బ్లౌపంక్ట్ 32 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ : రూ. 11,499
  • బ్లౌపంక్ట్ 40 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ : రూ. 16,499
  • బ్లౌపంక్ట్ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ : రూ. 17,499

ఈ మూడు క్యూలెడ్ స్మార్ట్ టీవీలు కూడా ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా వచ్చాయి.

Blaupunkt QLED Smart Tv : ఫీచర్స్

ఈ మూడు స్మార్ట్ టీవీలను కూడా దాదాపు ఒకే విధమైన ఫీచర్స్ తో అందించింది. అయితే, స్క్రీన్ రిజల్యూషన్ లో మాత్రం 32 ఇంచ్ మరియు 40 అండ్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీలలో మార్పు ఉంటుంది. ఈ మూడు టీవీలను కూడా 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన క్యూలెడ్ స్క్రీన్ తో అందించింది. వీటిలో 32 ఇంచ్ టీవీ HD Ready (1366 x 768) రిజల్యూషన్ కలిగి ఉంటే, 40 ఇంచ్ మరియు 43 ఇంచ్ టీవీలు FHD (1920 x 1080) రిజల్యూషన్ కలిగి ఉంటాయి. ఈ మూడు టీవీలు కూడా 350 నిట్స్ బ్రైట్నెస్ మరియు స్మార్ట్ ఐ కేర్ ఫీచర్ కలిగి ఉంటాయి.

ఈ మూడు టీవీలు కూడా లేటెస్ట్ క్వాడ్ కోర్ చిప్ సెట్ తో లాంచ్ అయ్యాయి. అంతేకాదు, ఈ లేటెస్ట్ చిప్ సెట్ తో జతగా 1 జీబీ ర్యామ్ మరియు 8 జీబీ అంతర్గత స్టోరేజ్ కలిగి ఉంటాయి. ఈ మూడు స్మార్ట్ టీవీలు కూడా రెండు స్పీకర్లు కలిగి 48W హెవీ సౌండ్ అవుట్ పుట్ అందిస్తాయి. అంతేకాదు, ఈ మూడు టీవీలు కూడా Dolby Digital Plus సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటాయి.

Also Read: iPHONE యూజర్లకు గుడ్ న్యూస్: ఆ పాత సిరీస్ ఫోన్లు కూడా iOS 27 అప్డేట్ అందుకుంటాయి.!

ఈ మూడు టీవీలు కూడా లేటెస్ట్ గూగుల్ 5.0 టీవీ OS పై పని చేస్తాయి.ఇక ఈ టీవీలు కలిగిన కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ టీవీలలో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.0, 3 HDMI, 2 USB, ఈథర్నెట్ మరియు AV ఇన్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :