iPHONE యూజర్లకు గుడ్ న్యూస్: ఆ పాత సిరీస్ ఫోన్లు కూడా iOS 27 అప్డేట్ అందుకుంటాయి.!

HIGHLIGHTS

యాపిల్ WWDC 2026 నుంచి iOS 27 ఆపరేటింగ్ సిస్టమ్ ను రిలీజ్ చేసింది

ఈ లేటెస్ట్ OS అప్డేట్ యాపిల్ ఐఫోన్ ఆ పాత సిరీస్ నుంచి లేటెస్ట్ ఆపిల్ 17 సిరీస్ వరకు అందుబాటులో ఉంటుంది

యాపిల్ ఫోన్స్ లో ముఖ్యమైన ఫీచర్ ‘Siri’ ని ఇప్పుడు “Siri AI” గా మార్చింది

iPHONE యూజర్లకు గుడ్ న్యూస్: ఆ పాత సిరీస్ ఫోన్లు కూడా iOS 27 అప్డేట్ అందుకుంటాయి.!

iPHONE యూజర్లకు గుడ్ న్యూస్: ఈరోజు యాపిల్ ప్రత్యేకంగా నిర్వహించిన యాపిల్ WWDC 2026 నుంచి iOS 27 ఆపరేటింగ్ సిస్టమ్ ను రిలీజ్ చేసింది. ఇందులో గుడ్ న్యూస్ ఏముంది అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. మరింత శక్తివంతమైన యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ తో కొత్త రిలీజ్ చేసిన ఈ లేటెస్ట్ OS అప్డేట్ యాపిల్ ఐఫోన్ 11 సిరీస్ నుంచి లేటెస్ట్ ఆపిల్ 17 సిరీస్ వరకు అందుబాటులో ఉంటుందని యాపిల్ ప్రకటించింది. పాత ఐఫోన్ ఉపయోగిస్తున్న వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అవుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iPHONE : iOS 27

యాపిల్ ఈరోజు ఐఓఎస్ 27 ను రిలీజ్ చేసింది. ఈ కొత్త అప్డేట్ ను మరింత శక్తివంతమైన యాపిల్ ఇంటెలిజెన్స్ మరియు కిడ్స్ కోసం ప్రత్యేకమైన సెక్యూరిటీ వంటి చాలా ఆకర్షణీయమైన ఫీచర్స్ ను కొత్త ఓఎస్ లో అందించింది. యాపిల్ ఫోన్స్ లో ముఖ్యమైన ఫీచర్ ‘Siri’ ని ఇప్పుడు “Siri AI” గా మార్చింది. అంటే, పాత ఫీచర్ ను పూర్తిగా కొత్త “Siri AI” గా పరిచయం చేసింది. ఇది మరింత సంభాషణాత్మకంగా పనిచేస్తుంది. అంతేకాదు, కొత్త సిరి ఏఐ స్క్రీన్‌ పై ఉన్న కంటెంట్‌ ను సైతం అర్థం చేసుకోగలదు. ఇది మాత్రమే కాదు గత సంభాషణలను గుర్తుంచుకో గలదు మరియు యాప్స్ మధ్య పనులు ని కూడా చేయగలుగుతుంది.

యాపిల్ అందించిన లేటెస్ట్ iOS 27 లో AI ఫీచర్ల పై ప్రధానంగా దృష్టి సారించింది. సఫారీలో AI ఆధారిత ట్యాబ్ ఆర్గనైజేషన్, ఫోటోస్ లో మెరుగైన AI ఎడిటింగ్ టూల్స్ మరియు పాస్వర్డ్ యాప్‌ లో స్మార్ట్ అప్‌ డేట్స్ వంటి ఫీచర్లు వచ్చాయి.

ముందుగా తెలిపినట్లుగా ఈ లేటెస్ట్ OS అప్డేట్ ను ఓల్డ్ వెర్షన్ యాపిల్ ఐఫోన్ 11 సిరీస్ నుంచి లేటెస్ట్ ఆపిల్ 17 సిరీస్ వరకు అందిస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పాత ఐఫోన్ లలో కొత్త అప్డేట్ వస్తుందా లేదా అని అనుమానం వ్యక్తం చేసిన ఓల్డ్ ఐఫోన్ యూజర్లు ఈ విషయం వినగానే ఎగిరి గంతేస్తారు.

గత ఏడాది వచ్చిన లిక్విడ్ గ్లాస్UI పై వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ను పరిగణనలోకి తీసుకున్న యాపిల్, ఇప్పుడు ట్రాన్స్‌పరెన్సీని యూజర్లు స్వయంగా నియంత్రించుకునే స్లైడర్‌ ను కొత్త OS లో జోడించింది. ఇది iOS 27 మరియు mac OSలో కూడా అందుబాటులోకి వస్తుంది. అంతేకాదు మ్యాక్ కోసం కొత్తగా macOS Golden Gate ను ప్రకటించింది. ఇందులో AI ఆధారిత సెర్చ్, మెరుగైన పెర్ఫార్మెన్స్ మరియు కొత్త డిజైన్ మార్పులు వంటి ఫీచర్స్ ఉన్నాయి.

Also Read: mAadhaar యాప్‌కు గుడ్‌ బై .. కొత్త Aadhaar App‌ కు మారండి : UIDAI కీలక నిర్ణయం

పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్

యాపిల్ ప్రకారం iOS 27 లో యాప్‌ లు మరింత వేగంగా ఓపెన్ అవుతాయి. అంతేకాదు, ఫోటోలు త్వరగా లోడ్ అవుతాయి మరియు మొత్తం సిస్టమ్ మరింత వేగంగా రెస్పాండ్ అవుతుంది. దీనితో పాటు పిల్లల రక్షణ కోసం కొత్తగా చైల్డ్ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఈ కొత్త ఓఎస్ లో యాపిల్ అందించింది. “Ask to Browse” సెట్టింగ్, గ్రాఫిక్ కంటెంట్ బ్లరింగ్ మరియు మెరుగైన పేరెంటల్ కంట్రోల్స్ ఈ కొత్త ఐఓఎస్ 27 లో అందుబాటులోకి వస్తాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile