mAadhaar యాప్‌కు గుడ్‌ బై .. కొత్త Aadhaar App‌ కు మారండి : UIDAI కీలక నిర్ణయం

HIGHLIGHTS

mAadhaar యాప్‌ ను నిలిపివేయాలని UIDAI నిర్ణయించింది

కొత్తగా ప్రవేశపెట్టిన Aadhaar App కు మారాలని వినియోగదారులకు యుఐడిఎఐ సూచిస్తోంది

ఆధునిక ఇంటర్‌ఫేస్ మరియు మరిన్ని డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది

mAadhaar యాప్‌కు గుడ్‌ బై .. కొత్త Aadhaar App‌ కు మారండి : UIDAI కీలక నిర్ణయం

ఆధార్ సేవలను వేగంగా మరియు సులభంగా స్మార్ట్‌ ఫోన్ ద్వారా సులభంగా వినియోగించేందుకు రూపొందించిన mAadhaar యాప్‌ ను నిలిపివేయాలని UIDAI నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన Aadhaar App కు మారాలని వినియోగదారులకు యుఐడిఎఐ సూచిస్తోంది. కొత్త యాప్‌ లో మెరుగైన భద్రతా ఫీచర్లు, ఆధునిక ఇంటర్‌ఫేస్ మరియు మరిన్ని డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

mAadhaar : New Aadhaar App‌

ఇప్పటి వరకు m ఆధార్ యాప్ ద్వారా ఆధార్ డౌన్‌ లోడ్, QR కోడ్ షేరింగ్, బయోమెట్రిక్ లాక్ ANDఅన్‌లాక్, ఆధార్ వెరిఫికేషన్ వంటి సేవలను వినియోగదారులు ఉపయోగించారు. అయితే, UIDAI ఇప్పుడు మరింత సురక్షితమైన మరియు సాంకేతికంగా అభివృద్ధి చెందిన సరికొత్త ఆధార్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జూన్ 30వ తేదీ నుంచి M ఆధార్ యాప్ సర్వీస్ లు పూర్తిగా నిలిపి వేయనున్నట్లు యుఐడిఎఐ ప్రకటించింది. ఈ నెల ప్రారంభంలో కొత్తగా ప్రవేశపెట్టిన కొత్త ఆధార్ యాప్ ను ఉపయోగించాలని కూడా సూచించింది.

కొత్త Aadhaar App‌ కు ఎలా మారాలి?

ఇది చాలా సింపుల్ అండ్ మీరు చాలా ఈజీగా ఈ కొత్త యాప్ కి మారవచ్చు. ముందుగా మీ స్మార్ట్‌ ఫోన్‌ లో గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ ఓపెన్ చేయండి. ఇందులో UIDAI విడుదల చేసిన అధికారిక ఆధార్ యాప్ ను డౌన్‌ లోడ్ చేసుకోండి. యాప్‌ ను ఇన్‌ స్టాల్ చేసిన తర్వాత మీ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌ తో లాగిన్ అవ్వండి. మీ ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ తో వచ్చే OTP తో ధృవీకరణ పూర్తి చేయండి. మీ ఆధార్ ప్రొఫైల్‌ ను కొత్త ఆధార్ యాప్‌ లో జోడించండి. అవసరమైతే బయోమెట్రిక్ లేదా PIN భద్రతను కూడా యాక్టివేట్ చేసుకోండి. అంతే, మీ కొత్త ఆధార్ యాప్ మీకు లభించింది.

mAadhaar  New Aadhaar App

కొత్త ఆధార్ యాప్ లో డిజిటల్ ఆధార్, QR ఆధారిత వెరిఫికేషన్, సురక్షిత KYC సేవలు మరియు ఆధార్ నిర్వహణకు సంబంధించిన మరిన్ని ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అయితే, అధికారిక UIDAI యాప్‌ ను మాత్రమే యూజర్లు డౌన్‌ లోడ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక కొత్త యాప్ ఫీచర్స్ విషయానికి వస్తే, యుఐడిఎఐ అఫీషియల్ గా విడుదల చేసింది. ఈ కొత్త ఆధార్ యాప్‌ లో ఫేస్ అతేంటికేషన్ సపోర్ట్‌ ను కూడా అందించింది. ఈ యాప్ లో OTP ఆధారిత అప్రూవ్ తో పాటు ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా కూడా యూజర్లు వారి గుర్తింపును నిర్ధారించుకునే అవకాశం అందించింది.

Also Read: Lava Bold N2 5G: సింగల్ డే డిస్కౌంట్ ఆఫర్ తో లావా బడ్జెట్ ఫోన్ ఫస్ట్ సేల్.!

యుఐడిఎఐ ఈ కొత్త ఆధార్ యాప్ లో QR కోడ్ ఆధారిత వెరిఫికేషన్ ఫీచర్ ను అందించింది. ఈ ఫీచర్ ద్వారా ఫిజికల్ ఆధార్ కార్డు తో పనిలేకుండా డిజిటల్‌ ఆధార్ ధృవీకరణ నిర్వహించవచ్చు. అంతేకాదు, ఆధార్ వివరాలు కస్టమైజ్ చేసి కొన్ని వివరాలతో కూడిన ఆధార్ ను అందించవచ్చు. అంటే, పరిమిత సమాచారాన్ని మాత్రమే ఈ కొత్త యాప్ ద్వారా షేర్ చేసే సెక్యూర్ సదుపాయం ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile