Lava Bold N2 5G: సింగల్ డే డిస్కౌంట్ ఆఫర్ తో లావా బడ్జెట్ ఫోన్ ఫస్ట్ సేల్.!

HIGHLIGHTS

లావా గతవారం మార్కెట్లో విడుదల చేసిన లావా బోల్డ్ ఎన్ 5జి స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ రేపు స్టార్ట్ అవుతుంది

ఈ ఫోన్ ఫస్ట్ డే సేల్ నుంచి భారీ లాంచ్ ఆఫర్ తో మరింత బడ్జెట్ ధరలో లభిస్తుంది

ఈ ఆఫర్ కేవలం ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది

Lava Bold N2 5G: సింగల్ డే డిస్కౌంట్ ఆఫర్ తో లావా బడ్జెట్ ఫోన్ ఫస్ట్ సేల్.!

Lava Bold N2 5G: ప్రముఖ భారతీయ మొబైల్ తయారీ కంపెనీ లావా గతవారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన లావా బోల్డ్ ఎన్ 5జి స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ రేపు స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ కి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే, ఈ ఫోన్ ఫస్ట్ డే సేల్ నుంచి భారీ లాంచ్ ఆఫర్ తో మరింత బడ్జెట్ ధరలో లభిస్తుంది. అయితే, ఈ ఆఫర్ కేవలం ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lava Bold N2 5G: ప్రైస్ అండ్ ఆఫర్స్

లావా ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను రూ. 12,999 రూపాయల బడ్జెట్ ధరతో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ పై గొప్ప సింగల్ డే లాంచ్ ఆఫర్ కూడా అందించింది. మొదటి రోజు సేల్ నుంచి ఈ ఫోన్ పై రూ. 1,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అంటే, ఈ ఫోన్ మొదటి రోజు కేవలం రూ. 11,999 రూపాయల లాంచ్ ఆఫర్ ప్రైస్ లో మీకు లభిస్తుంది. బోల్డ్ ఎన్ 2 స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ జూన్ 9వ తేదీ అంటే, రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది.

Also Read: Earthquake: దేశంలో పలు ప్రాంతాల్లో వచ్చిన భూకంపం .. ఆన్‌ లైన్‌ లో లైవ్ ఎర్త్‌క్వేక్‌ ఎలా చెక్ చేయాలో తెలుసా.!

Lava Bold N2 5G: ఫీచర్స్

లావా ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో ఎన్నడూ చూడని సరికొత్త స్టైలిష్ డిజైన్ తో అందించింది. బోల్డ్ ఎన్ 2 స్మార్ట్ ఫోన్ లో 6.75 ఇంచ్ పెద్ద డిస్ప్లే ఉంటుంది. ఈ బిగ్ స్క్రీన్ ను HD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ తో అందించింది. ఈ బడ్జెట్ ఫోన్ ను Unisoc T8200 బడ్జెట్ ఆక్టా కోర్ ప్రాసెసర్ తో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ను వేగంగా మార్చి డానికి వీలుగా ఇందులో 4జీబీ ఫిజికల్ ర్యామ్ మరియు 4 జీబీ వర్చువల్ ర్యామ్ తో టోటల్ 8GB ర్యామ్ ఫీచర్ అందించింది. అలాగే, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఈ ఫోన్ లో అందించింది. లావా బోల్డ్ ఎన్ 2 బ్లోట్ వేర్ ఫ్రీ ఆండ్రాయిడ్ 16 OS తో పని చేస్తుంది.

Lava Bold N2 5G

లావా బోల్డ్ ఎన్ 2 స్మార్ట్ ఫోన్ 13MP డ్యూయల్ రియర్ కెమెరాతో లాంచ్ అయ్యింది. ఇది FHD వీడియో సపోర్ట్ మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో 5MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే, 6000 mah భారీ బ్యాటరీతో ఈ ఫోన్ ను రిలీజ్ చేసింది. 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో ఈ ఫోన్ బడ్జెట్ ఫాస్ట్ ఛార్జ్ ఫోన్ గా నిలిచింది. ఈ ఫోన్ IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ మరియు లావా ఫ్రీ హోమ్ సర్వీస్ తో జతగా వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile