Flipkart Sale last day offers huge deals on QLED Smart Tvs
Flipkart Sale ఈరోజు అర్ధరాత్రి తో ముగియనుండగా ఈరోజు గొప్ప డీల్స్ అందించింది. ఫ్లిప్ కార్ట్ నెల ప్రారంభంలో అందించిన బిగ్ బచాత్ సేల్ నుంచి ఈ డీల్స్ అందించింది. ఇందులో మరి ముఖ్యంగా లాస్ట్ గా విడుదలైన QLED Smart Tv లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. అందుకే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లభిస్తున్న క్యూలెడ్ స్మార్ట్ టీవీ లలో బెస్ట్ డీల్స్ గురించి వివరాలు అందిస్తున్నాను.
ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈరోజు రెండు క్యూలెడ్ స్మార్ట్ టీవీ లు గొప్ప డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తున్నాయి. ఈ రెండు టీవీలు కూడా ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం 20 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ఆ రెండు స్మార్ట్ డీల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ థాంసన్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 34% డిస్కౌంట్ తో రూ. 20,999 ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. ఈ టీవీని SBI మరియు HDFC క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 19,499 రూపాయల ధరకు లభిస్తుంది.
ఈ థాంసన్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K (3840 × 2160) రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Vision, HDR 10+ మరియు HLG సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ థాంసన్ స్మార్ట్ టీవీ మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Atmos మరియు DTS TruSurround సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది.
Also Read: అమెజాన్ భారీ డిస్కౌంట్ తో 240W Dolby Soundbar అతి తక్కువ ధరలో లభిస్తోంది.!
ఈ కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ కూడా 43 ఇంచ్ క్యూలెడ్ స్క్రీన్ తో వస్తుంది మరియు Dolby Atmos తో పాటు HDR 10 సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ కూడా క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కలిగి 40W సౌండ్ అవుట్ పుట్ తో మంచి సౌండ్ అందిస్తుంది.
ఈ కోడాక్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ సేల్ నుంచి 32% డిస్కౌంట్ తో రూ. 21,499 ధరతో లభిస్తోంది. అయితే, ఈ స్మార్ట్ టీవీని SBI మరియు HDFC క్రెడిట్ కార్డు తో కొనే వారికి రూ. 1,500 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీ కేవలం రూ. 19,999 ధరకు లభిస్తుంది.