Lava Virat V1 5G కంప్లీట్ ఫీచర్స్ అండ్ అంచనా ప్రైస్ లాంచ్ కంటే ముందే తెలుసుకోండి.!

HIGHLIGHTS

Lava Virat V1 5G స్మార్ట్ ఫోన్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది

ఈ ఫోన్ లాంచ్ కంటే ఒకరోజు ముందే ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ వెల్లడించింది

ఈ అప్ కమింగ్ ఫోన్ అంచనా ప్రైస్ ఆన్లైన్ లో లీక్ అయ్యింది

Lava Virat V1 5G స్మార్ట్ ఫోన్ రేపు ఇండియాలో లాంచ్ అంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం లావా గత రెండు వారాలుగా టీజింగ్ చేస్తూ వస్తోంది. ఎట్టకేలకు రేపు ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ కంటే ఒకరోజు ముందే ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ మరియు అంచనా ప్రైస్ కూడా తెలుసుకోండి.

Lava Virat V1 5G: ఫీచర్స్

లావా ఈ ఫోన్ ను సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో ఉన్నట్లు టీజర్ ఇమేజ్ ద్వారా క్లియర్ `అవుతుంది. ఈ ఫోన్ లో 6.75 ఇంచ్ పరిమాణం కలిగిన పెద్ద LCD స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ HD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

ఈ కొత్త ఫోన్ Unisoc T8200 Soc ఆక్టా కోర్ 5జి చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఇది 4,50,000 కంటే అధిక AnTuTu స్కోర్ అందించే 6nm చిప్ సెట్ మరియు జతగా 4GB ఫిజికల్ ర్యామ్ తో పాటు 4GB వర్చువల్ ర్యామ్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను 64GB స్టోరేజ్ తో అందిస్తుంది. ఈ ఫోన్ లేటెస్ట్ క్లీన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ తో లాంచ్ చేస్తుంది.

ఈ ఫోన్ 13MP Ai డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ మరియు లావా లేటెస్ట్ కెమెరా ఫిల్టర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6000 mAh భారీ బ్యాటరీని అందించింది మరియు ఈ బిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే ఫాస్ట్ రీఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది.

ఇక ఫోన్ IP 4 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ కూడా లావా యొక్క ఉచిత హోమ్ సర్వీస్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆర్యా బ్లూ మరియు సోనార్ గోల్డ్ రెండు రంగుల్లో లాంచ్ అవుతుంది.

Also Read : OnePlus N6x : లాంచ్ డేట్ మరియు డిజైన్ రివీల్ చేసిన వన్ ప్లస్.. ఫోన్ అదిరింది భయ్యా.!

Lava Virat V1 5G: అంచనా ప్రైస్ ఏమిటి?

లావా విరాట్ వి1 5జి స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ను కంపెనీ అఫీషియల్ గా రివీల్ చేసింది. అయితే, ఈ ఫోన్ ప్రైస్ మాత్రం రేపు రివీల్ చేస్తుంది. అయితే, ఈ ఫోన్ అంచనా ధర మాత్రం ఆన్లైన్ లో లీకయ్యింది. లీక్స్ ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రూ. 12,999 నుంచి 14,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :