Realme 16 Pro Harry Potter Edition: ప్రీమియం ఫీచర్స్ మరియు Gift బాక్స్ తో లాంచ్.!

HIGHLIGHTS

Realme 16 Pro Harry Potter Edition ని ఎట్టకేలకు ఈరోజు లాంచ్ చేసింది

ఈ ఫోన్ ను ప్రీమియం ఫీచర్స్ మరియు ప్రత్యేకమైన Gift బాక్స్ తో లాంచ్ చేసింది

ఈ ఫోన్ లాంచ్ తో ప్రత్యేకమైన బస్సు టూర్ కోసం కూడా రిజిస్ట్రేషన్ ఆఫర్ అందించింది

Realme 16 Pro Harry Potter Edition: గత కొంత కాలంగా రియల్ మీ గొప్పగా టీజింగ్ చేస్తున్న, ప్రత్యేకమైన స్మార్ట్ ఫోన్ ఎడిషన్ ని ఎట్టకేలకు ఈరోజు లాంచ్ చేసింది. అదే, రియల్ మీ 16 ప్రో హ్యారీ పాటర్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను ప్రీమియం ఫీచర్స్ మరియు ప్రత్యేకమైన Gift బాక్స్ తో లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ రియల్ మీ ఫోన్ తో కంపెనీ అందించిన గిఫ్ట్ బాక్స్ ఏమిటి మరియు ఈ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఏమిటో ఓకే లుక్కేద్దామా.

Realme 16 Pro Harry Potter Edition: ప్రైస్

ఈ ఫోన్ ను కేవలం 12GB + 256GB సింగల్ వేరియంట్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను రూ. 62,999 ప్రైస్ తో విడుదల చేసింది. ఈ ఫోన్ రేపటి నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ లాంచ్ తో ప్రత్యేకమైన బస్సు టూర్ కోసం కూడా రిజిస్ట్రేషన్ ఆఫర్ అందించింది. ఈ టూర్ ద్వారా ఈ ప్రత్యేకమైన గిఫ్ బాక్స్ ని ఇచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

అయితే, ఈ బస్ టూర్ కోసం మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికోసం కంపెనీ వెబ్సైట్ నుంచి మేరీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇందులో మొత్తం 5 ప్రధాన నగరాలలో టూర్ ఉంటుంది. ఇది సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 23 తేదీ వరకు కొనసాగుతుంది.

ఆఫర్స్

ఈ ఫోన్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ అండ్ నో కాస్ట్ EMI ఆఫర్స్ అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ ను HDFC, ICICI, SBI క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి రూ. 6,300 రూపాయల భారీ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ అఫర్ తో ఈ ఫోన్ ను రూ. 56,999 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు. అంతేకాదు, Bajaj కార్డు తో ఈ ఫోన్ తీసుకునే వారికి కూడా 12 నెలల EMI ఆఫర్ ని అందించింది.

Also Read: Lava Virat Curve ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!

Realme 16 Pro Harry Potter Edition: ఫీచర్స్

రియల్ మీ ఈ కొత్త ఫోన్ ను 6.8 ఇంచ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ చేసింది. ఇది 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1.5K రిజల్యూషన్, HDR 10+ సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 94 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను 9,71,755 కంటే అధిక AnTuTu స్కోర్ ఆఫర్ చేసే మీడియాటెక్ Dimensity 7300 Max చిప్ సెట్ తో రిలీజ్ చేసింది. దానికి జతగా 12 జీబీ ర్యామ్ అండ్ 256 జీబీ స్టోరేజ్ ని కూడా ఆఫర్ చేసింది. ఇది గొప్ప పెర్ఫార్మెన్స్ అందించే కంప్లీట్ ఫీచర్ కలిగి ఉంటుంది.

కెమెరా విభాగంలో, ఈ ఫోన్ జబర్దస్త్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో సూపర్ OIS సపోర్ట్ కలిగిన 200MP ప్రధాన కెమెరా జతగా 112 డిగ్రీ వైడ్ యాంగిల్ 8MP సెకండరీ మరియు మరో కెమెరా ఉంటాయి. అలాగే, ఈ ఫోన్ లో సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం 50MP సెల్ఫీ కెమెరాని కూడా అందించింది. ఈ ఫోన్ 30fps 4k వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు లేటెస్ట్ AI ఫీచర్స్ తో పాటు ప్రత్యేకంగా అందించిన హ్యారీ పాటర్ కెమెరా కెమెరా ఫిల్టర్లు కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :