Dussehra Sale సందడి మొదలైంది : భారీ ఆఫర్స్ తో పండుగ సేల్ అనౌన్స్ చేసిన Amazon మరియు Flipkart

HIGHLIGHTS

2026 అతిపెద్ద పండుగ దసరా కోసం ఇప్పటికే పండుగ సీజన్ మొదలైనట్లు కనిపిస్తోంది

Amazon మరియు Flipkart మాత్రం ఇప్పటికే ఈ పండుగ వాతావరణం మొదలు పెట్టాయి

ఫ్లిప్ కార్ట్ BBD Sale సెల్ అనౌన్స్ చేయగా తర్వాత అమెజాన్ GIF Sale ని అనౌన్స్ చేసింది

Dussehra Sale సందడి మొదలైంది: 2026 అతిపెద్ద పండుగ దసరా కోసం ఇప్పటికే పండుగ సీజన్ మొదలైనట్లు కనిపిస్తోంది. ఆఫ్ లైన్ షోరూమ్స్, మార్కెట్లో యూజర్ల కోసం పండగ వాతావరణం సృష్టించడానికి ఇప్పుడిప్పుడే రెడీ అవుతుండగా, దేశంలో అతిపెద్ద ఈ-కార్ట్ ప్లాట్ ఫార్మ్స్ అయిన Amazon మరియు Flipkart మాత్రం ఇప్పటికే ఈ పండుగ వాతావరణం మొదలు పెట్టాయి. 2020 దసరా పండుగ కోసం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్ ప్రకటించగా ఫ్లిప్ కార్ట్ బిగ్ డేస్ 2026 అనౌన్స్ చేసింది. ఈ రెండు బిగ్ సేల్స్ కూడా ఒకే సమయంలో ప్రారంభం అవ్వడం కోసం మెరుపు.

Dussehra Sale సందడి మొదలైంది:

2026 విజయదశమి పండుగ సందర్భంగా అమెజాన్ ఇండియా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026 ని అక్టోబర్ 8వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నట్టు సేల్ డేట్ అనౌన్స్ చేసింది. అలాగే అదే విజయదశమి పండుగ కోసం బిగ్ బిలియన్ డేస్ 2026 సేల్ ని అక్టోబర్ 9వ తారీకు నుంచి ప్రారంభిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ కూడా అనౌన్స్ చేసింది.

ముందుగా ఫ్లిప్ కార్ట్ BBD Sale సెల్ అనౌన్స్ చేయగా తర్వాత అమెజాన్ GIF Sale ని అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఈ రెండు బిగ్ ఈకార్ట్ ప్లాట్ ఫారం లు కూడా ఈ అప్ కమింగ్ సేల్ నుంచి అందించనున్న బిగ్ డీల్స్ అండ్ ఆఫర్స్ తో ప్రత్యేకమైన మైక్రో సైడ్ పేజీలు కూడా అందించాయి.

Flipkart BBD Sale

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. అయితే, ఫ్లిప్ కార్ట్ బ్లాక్ అండ్ ఫ్లిప్ కార్ట్ ప్లస్ యూజర్లకు అక్టోబర్ 8 నుంచే సాల్ యాక్సెస్ లభిస్తుంది. ఈ అప్ కమింగ్
సేల్ యొక్క ముందస్తు యాక్సెస్ ను సెప్టెంబర్ 24 నుంచి ఆఫర్ చేస్తున్నట్లు కూడా ఫ్లిప్ కార్ట్ కొత్తగా అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి అందించే బిగ్ డీల్స్ ‘Wish List’ ని మీరు సెప్టెంబర్ 24 నుంచి కార్ట్ లో యాడ్ చేసుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.

Also Read: Amazon Great Indian Festival 2026 సేల్ డేట్ అనౌన్స్ చేసింది.. సేల్ ఆఫర్స్ తో టీజర్ పేజీ రివీల్.!

Amazon GIF Sale

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ సేల్ నుంచి అందించనున్న బిగ్ డీల్స్ రివీల్ చేయడానికి అమెజాన్ ఒక ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజీని అందించింది. ఈ పేజీ నుంచి అప్ కమింగ్ డీల్స్ తో టీజింగ్ మొదలు పెట్టింది. ఈ సేల్ నుంచి భారీ డీల్స్ మరియు ఆఫర్లు అందుకోవచ్చని అమెజాన్ భారీగా టీజింగ్ చేస్తోంది.

మొత్తానికి, దసరా 2026 పండుగ కంటే 20 రోజుల ముందు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ అప్ సేల్ కోసం భారీగా ప్రచారం మొదలు పెట్టాయి. ఇప్పటికే మార్కెట్లో స్మార్ట్ ఫోన్ రేట్లు పెరగగా, ఈ సేల్ నుంచి స్మార్ట్ ఫోన్ పై మంచి ఆఫర్స్ అందిస్తే బాగుండు అని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :