OnePlus N6x : లాంచ్ డేట్ మరియు డిజైన్ రివీల్ చేసిన వన్ ప్లస్.. ఫోన్ అదిరింది భయ్యా.!

HIGHLIGHTS

OnePlus N6x లాంచ్ డేట్ ని ఈ రోజు అనౌన్స్ చేసింది

వన్ ప్లస్ ఎన్6 సిరీస్ నుంచి మరో స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది

టీజర్ లో ఈ ఫోన్ యొక్క డిజైన్ మరియు ఇతర వివరాలు కనిపిస్తున్నాయి

OnePlus N6x: వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ ఎన్6x లాంచ్ డేట్ ని ఈ రోజు అనౌన్స్ చేసింది. ఇటీవల వన్ ప్లస్ ఎన్ 6 సిరీస్ నుంచి మొదటి ఫోన్ అందించిన వన్ ప్లస్, ఇప్పుడు ఇదే సిరీస్ నుంచి మరో స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క టీజర్ ద్వారా ఈ ఫోన్ ఎలా ఉంటుందో కూడా తెలియజేసింది.

OnePlus N6x : లాంచ్ డేట్

వన్ ప్లస్ ఎన్ 6x స్మార్ట్ ఫోన్ ను జూలై 31వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ డేట్ అండ్ టైం కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ద్వారా అందించిన ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీ నుంచి ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు టీజర్ ను కూడా రిలీజ్ చేసింది. ఇందులో ఈ ఫోన్ యొక్క డిజైన్ మరియు ఇతర వివరాలు కనిపిస్తున్నాయి.

OnePlus N6x : టీజర్ వీడియో వివరాలు ఏమిటి?

వన్ ప్లస్ ఎన్ 6x స్మార్ట్ ఫోన్ టీజర్ వీడియో లో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కలర్ ఆప్షన్ మరియు డిజైన్ వివరాలు వెల్లడించింది. మేము ముందుగా తెలిపిన విధంగా ఈ ఫోన్ లో నార్డ్ 5 సిరీస్ ఫోన్ లలో అందించిన నిలువు కెమెరా డిజైన్ ఉంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. అయితే నార్డ్ 5 సిరీస్ ఫోన్ లలో LED ఫ్లాష్ కెమెరా సెటప్ క్రింద ఉంటే., ఈ అప్ కమింగ్ ఫోన్ లో మాత్రం కెమెరా పక్కన ఉంటుంది.

ఇక డిజైన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ మరియు వెనుక చాలా సన్నని నిలువు గీతలు కలిగిన బ్యాక్ ప్యానల్ తో ఉంటుంది. ఇది వన్ ప్లస్ ఫోన్ లలో ముందెన్నడూ చూడని డిజైన్ మరియు ఇది ఫోన్ కు మరింత గ్రిప్ అందించే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ ను బర్గండి రెడ్ మరియు ఐస్ బ్లూ రెండు రంగుల్లో లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లుక్స్ పరంగా అదిరిపోయేలా ఉంది.

ఈ రోజు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు డిజైన్ తెలిపే టీజర్ ని మాత్రమే వన్ ప్లస్ విడుదల చేసింది. ఈ ఫోన్ కీలక ఫీచర్స్ ని ఇంకా రివీల్ చేయలేదు. ఈరోజు లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది కాబట్టి, ఈ ఫోన్ కీలక ఫీచర్స్ కూడా ఒకొక్కటిగా ఈరోజు నుంచి విడుదల చేసే అవకాశం ఉంది.

Also Read: Sony Dolby Soundbar ఈరోజు భారీ డిస్కౌంట్ తో చీప్ ప్రైస్ లో లభిస్తుంది.!

వన్ ప్లస్ ఎన్ 6x : లీక్డ్ అండ్ అంచనా ఫీచర్స్

ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్న లీక్స్ ప్రకారం, MediaTek Dimensity 6000 సిరీస్ ప్రాసెసర్ తో ఈ ఫోన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే, 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.75 ఇంచ్ LCD డిస్ప్లే మరియు 6000 mAh బిగ్ బ్యాటరీ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ లో ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు బెస్ట్ కూలింగ్ ఫీచర్ ఉండే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :