boAt Nirvana Eutopia 2 ANC launched with 80 hours long playback support
boAt Nirvana Eutopia 2 ANC హెడ్ ఫోన్ ను ఈరోజు బోట్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ కొత్త హెడ్ ఫోన్ ను 80 గంటల లాంగ్ ప్లే బ్యాక్ మరియు గొప్ప క్వాలిటీ ఆడియో అందించే డ్యూయల్ డ్రైవర్స్ తో లాంచ్ చేసింది. కేవలం బ్యాటరీ మాత్రమే కాదు ఈ హెడ్ ఫోన్ సౌండ్, స్టైల్ మరియు మరిన్ని ఇతర ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ లేటెస్ట్ బోట్ హెడ్ ఫోన్ స్పెక్స్, ఫిచర్స్ మరియు ఫీచర్స్ పియా ఒక లుక్కేద్దామా.
బోట్ ఈ హెడ్ ఫోన్ ను కేవలం రూ. 4,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ హెడ్ ఫోన్ ను కాస్మిక్ బ్లాక్ మరియు యుటోపియన్ వైట్ రెండు రంగుల్లో లాంచ్ చేసింది. ఈ హెడ్ ఫోన్ బోట్ అఫీషియల్ సైట్ మరియు ప్రముఖ ఈ కామర్స్ సైట్స్ లో కూడా లభిస్తుంది.
ఈ బోట్ లేటెస్ట్ వైర్ లెస్ ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్స్ అధిక నాణ్యత గల ఆడియో అనుభవాన్ని అందించే ఫీచర్స్ తో రూపొందించబడ్డాయి. ఈ హెడ్ ఫోన్ ను డైలీ వినియోగానికి తగిన విధంగా అందించింది. ఈ హెడ్ ఫోన్ లో మృదువైన ఇయర్ కుషన్స్ మరియు సౌకర్యవంతమైన హెడ్ బ్యాండ్ డిజైన్ కారణంగా ఎక్కువసేపు ధరించినా అసౌకర్యం కలగకుండా ఉంటుంది. ఇందులో డ్యూయల్ డ్రైవర్ సెటప్ అందించింది. అంటే, డీప్ బాస్ తో పాటు స్పష్టమైన మిడ్ మరియు హై ఫ్రీక్వెన్సీ సౌండ్ కూడా లభిస్తుంది.
ఇందులో 45dB అడాప్టివ్ హైబ్రిడ్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) టెక్ అందించింది. ఈ ఫీచర్ తో హెడ్ ఫోన్ చుట్టుపక్కల ఉన్న శబ్దాన్ని గణనీయంగా తగ్గించి సంగీతం, సినిమాలు లేదా కాల్స్ ను మరింత స్పష్టంగా ఆఫర్ చేస్తుంది. పరిసరాల శబ్దాన్ని బట్టి ANC పెర్ఫార్మెన్స్ ఆటోమేటిగ్గా సర్దుబాటు కావడం వల్ల వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవం లభిస్తుంది.
బ్యాటరీ పరంగా కూడా ఈ లేటెస్ట్ బోట్ హెడ్ ఫోన్ గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ హెడ్ ఫోన్ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, ANC ఆఫ్ లో కూడా ఎక్కువసేపు ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని బోట్ తెలిపింది. ఈ హెడ్ ఫోన్ లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల కొద్దిసేపు ఛార్జ్ చేసినా కూడా కొన్ని గంటల పాటు వినియోగించుకోవచ్చు.
Also Read: Lava Virat V1 5G కంప్లీట్ ఫీచర్స్ అండ్ అంచనా ప్రైస్ లాంచ్ కంటే ముందే తెలుసుకోండి.!
ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, ఇందులో బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ ఉంది. ఈ కారణంగా మీకు స్థిరమైన వైర్ లెస్ కనెక్షన్ లభిస్తుంది. అంతేకాదు, మల్టీ పాయింట్ కనెక్టివిటీ సపోర్ట్ ఉండటంతో ఒకేసారి రెండు పరికరాలకు కనెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే, వైర్డ్ కనెక్షన్ ద్వారా హై రిజల్యూషన్ ఆడియో ఆస్వాదించే అవకాశం కూడా ఉంది.