ఇది కదా ఆఫర్ అంటే .. కేవలం 55 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ 4K QLED Smart Tv అందుకోండి.!
దీపావళి పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ తీసుకొచ్చిన బిగ్ బ్యాంక్ దివాళి సేల్ ని పండుగ తర్వాత కూడా ఇంకా కొనసాగిస్తోంది
65 ఇంచ్ 4K QLED Smart Tv టీవీని కేవలం 55 ఇంచ్ స్మార్ట్ టీవీ రేటుకే అందుకునే గొప్ప డిస్కౌంట్ ఆఫర్
ఈ ప్రైస్ లో ఇది తగిన పర్ఫార్మెన్స్ అందించే స్మార్ట్ టీవీ అవుతుంది
దీపావళి పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ తీసుకొచ్చిన బిగ్ బ్యాంక్ దివాళి సేల్ ని పండుగ తర్వాత కూడా ఇంకా కొనసాగిస్తోంది. అంతేకాదు, ఈరోజు ఇది కదా ఆఫర్ అంటే, అనేలా ఒక గొప్ప స్మార్ట్ టీవీ డీల్ ని కూడా ఈ సేల్ నుంచి అందించింది. ఇండియన్ మార్కెట్లో రీసెంట్ గా విడుదలైన ఒక 65 ఇంచ్ 4K QLED Smart Tv టీవీని కేవలం 55 ఇంచ్ స్మార్ట్ టీవీ రేటుకే అందుకునేలా గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ ఈ టీవీ పై ఆఫర్ చేసింది. ప్రస్తుతం నడుస్తున్న ఈ సేల్ లో చూడదగిన బెస్ట్ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ గా ఇది ఈరోజు నిలిచింది.
65 ఇంచ్ 4K QLED Smart Tv : ఆఫర్
realme TechLife గత సంవత్సరం విడుదల చేసిన 65 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ (65UHDGQRDDVQ) మోడల్ ని ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 45 శాతం భారీ డిస్కౌంట్ తో రూ. 47,999 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ చేసింది. ఈ సేల్ నుంచి ప్రస్తుతం ఆఫర్ చేస్తున్న SBI బ్యాంక్ క్రెడిట్ కార్డు రూ. 8,500 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ ని కూడా ఈ స్మార్ట్ టీవీ పై జత చేసింది.
ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంక్ సేల్ నుంచి ఈరోజు అందించిన ఈ రెండు బిగ్ డిస్కౌంట్ ఆఫర్లతో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 39,499 రూపాయల డిస్కౌంట్ ధరలో మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ప్రైస్ లో ఇది తగిన పర్ఫార్మెన్స్ అందించే స్మార్ట్ టీవీ అవుతుంది.
Also Read: ఫ్లోర్ స్టాండ్ తో వచ్చే Zebronics 5.1 Dolby సౌండ్ బార్ ఈరోజు నార్మల్ సౌండ్ బార్ ధరకే లభిస్తోంది!
65 ఇంచ్ 4K QLED Smart Tv : ఫీచర్స్
ఈ రియల్ మీ టెక్ లైఫ్ స్మార్ట్ టీవీ పెద్ద స్క్రీన్ పై అత్యుత్తమ విజువల్ అనుభూతిని అందించేలా రూపొందించబడింది. ఇందులో 3840 × 2160 పిక్సెల్స్ రిజల్యూషన్ తో కూడిన 4K UHD డిస్ప్లే ఉంటుంది. క్యూలెడ్ టెక్నాలజీ కారణంగా సాధారణ ఎల్ఈడి టీవీలతో పోలిస్తే మెరుగైన కలర్ రీప్రొడక్షన్, బ్రైట్నెస్, స్పష్టమైన విజువల్స్ ను ఆస్వాదించవచ్చు. ఈ టీవీలో HDR సపోర్ట్ తో సినిమాలు, వెబ్ సిరీస్లు, స్పోర్ట్స్ కంటెంట్ లో మరింత సహజమైన రంగులు మరియు మెరుగైన కాంట్రాస్ట్ కనిపిస్తాయి.
ఇక స్మార్ట్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ పై నడుస్తుంది. ఇందులో గూగుల్ అసిస్టెంట్ వాయిస్ సెర్చ్, క్రోమ్ క్యాస్ట్ బిల్ట్ ఇన్, Wi-Fi, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇది MediaTek క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2GB RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఆడియో విషయానికి వస్తే 40W స్పీకర్ అవుట్ పుట్ తో పాటు డాల్బీ అట్మోస్ సపోర్ట్ అందించారు. కనెక్టివిటీ కోసం 3 HDMI పోర్టులు, 2 USB పోర్టులు, Ethernet, Optical Audio అవుట్ పుట్ ఉన్నాయి.