20 వేలకే 43 ఇంచ్ 4K QLED స్మార్ట్ టీవీ అందుకునే సువర్ణావకాశం.!

HIGHLIGHTS

కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి సువర్ణావకాశం

20 వేల ధరలోనే 43 ఇంచ్ 4K QLED స్మార్ట్ టీవీ అందుకోండి

ఈ స్మార్ట్ టీవీ Dolby సౌండ్ మరియు Dolby Vision సపోర్ట్ తో వస్తుంది

20 వేలకే 43 ఇంచ్ 4K QLED స్మార్ట్ టీవీ అందుకునే సువర్ణావకాశం.!

కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి ఈరోజు సువర్ణావకాశం అందుబాటులో వుంది. అది కూడా నార్మల్ LED స్మార్ట్ టీవీ కాదండోయ్, 20 వేల ధరలోనే 43 ఇంచ్ 4K QLED స్మార్ట్ టీవీ అందుకునే సువర్ణావకాశం మీ ముందుంది. ఇటీవల మార్కెట్ లో విడుదలైన బ్రాండెడ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ దెబ్బకి ఇంత చవక ధరలో లభిస్తోంది. మరి ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ పై ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటా 43 ఇంచ్ 4K QLED స్మార్ట్ టీవీ సువర్ణావకాశం?

ప్రముఖ జర్మనీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బ్లౌపంక్ట్ భారత మార్కెట్ లో ఇటీవల లాంచ్ చేసిన 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ ‘43QD7050’ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 32% భారీ డిస్కౌంట్ తో రూ. 22,999 ధరకే లభిస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ స్మార్ట్ టీవీని Federal Bank కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ఈ రెండు ఆఫర్లతో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 20,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ 43 ఇంచ్ 4K క్యూలెడ్ స్మార్ట్ టీవీని ఎన్నడూ చూడనంత చవక ధరకు పొందవచ్చు.

Also Read: Motorola Edge 50 Neo: Sony LYTA లేటెస్ట్ కెమెరా మరియు సూపర్ స్క్రీన్ తో లాంచ్ అవుతోంది.!

Blaupunkt Quantum Dot 43 ఇంచ్ 4K QLED : ఫీచర్లు

బ్లౌపంక్ట్ యొక్క ఈ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 3840 × 2160 రిజల్యూషన్ కలిగిన QLED స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ Dolby Vision, 4K HDR 10+, MEMC  మరియు HLG సపోర్ట్ లతో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈటీవీ 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కూడా వస్తుంది.

Flipakrt 4K QLED Deal

ఈ బ్లౌపంక్ట్ స్మార్ట్ టీవీ HDMI, USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ WiFi సపోర్ట్ లను కలిగి ఉంటుంది. సౌండ్ పరంగా, ఈ స్మార్ట్ టీవీ Dolby Atmos మరియు dts True Surround సౌండ్ సపోర్ట్ లతో వస్తుంది మరియు 50W సౌండ్ అవుట్ పుట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo