Flipkart BBD Sale 2026 big 65 inch Mini LED smart tv deal announced
Flipkart BBD Sale 2026 బిగ్ డీల్స్ ను ఈరోజు రివీల్ చేసింది. 2026 దసరా పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసిన బిగ్ సేల్ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఈరోజు భారీ డీల్స్ అనౌన్స్ చేయడం ప్రారంభించింది. ఈ సేల్ నుంచి షియోమీ 65 ఇంచ్ స్మార్ట్ టీవీని 50 ఇంచ్ రేటుకే అందుకోవచ్చు. అంతగా ఈ స్మార్ట్ టీవీ పై బిగ్ డీల్ ని ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది.
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభం అవుతుంది. అయితే, ఒకరోజు ముందు, అనగా అక్టోబర్ 8 నుంచి ఈ సేల్ ప్రత్యేకమైన యాక్సెస్ ఫ్లిప్ కార్ట్ బ్లాక్ మరియు ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యులకు లభిస్తుంది.
ఈ సేల్ నుంచి ఆఫర్ చేయనున్న బిగ్ స్మార్ట్ టీవీ డీల్ ని ఈరోజు ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. అదేమిటంటే, షియోమీ యొక్క 65 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ FX Mini LED ని కేవలం 50 ఇంచ్ టీవీ రేటుకే అందుకోవచ్చని తెలిపింది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఈ టీవీని ఫ్లిప్ కార్ట్ అన్ని ఆఫర్స్ తో కలిగి కేవలం రూ. 3X,999 రేటుకే అందిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. అంటే, ఈ టీవీ రేటు ఎంత ఎక్కువగా లెక్క వేసుకున్న రూ. 39,999 ధరలో లభించే అవకాశం ఉంటుంది.
ఈ ప్రైస్ సెగ్మెంట్ లో కొన్ని ప్రీమియం బ్రాండ్స్ కేవలం 50 ఇంచ్ టీవీ లను మాత్రమే ఆఫర్ చేస్తుండగా, మీరు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఇదే ధరలో 65 ఇంచ్ బిగ్ మినీ ఎల్ఈడి టీవీ అందుకోవచ్చు. ఇది ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న బిగ్ ఫెస్టివల్ ఆఫర్ గా ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది.
వాస్తవానికి, ఈరోజు ఈ స్మార్ట్ టీవీ ఏకంగా రూ. 64,999 రూపాయల ధరలో లిస్ట్ అయ్యింది. అయితే, ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి దాదాపు 40 వేల రూపాయల ధరలో లభించినా కూడా ఇది నిజంగా గొప్ప డీల్ అవుతుంది. ఎందుకంటే, ఈ టీవీ సేల్ నుంచి ఏకంగా 25 వేల రూపాయల డిస్కౌంట్ ధరలో అందుతుంది.
ఈ టీవీ 65 ఇంచ్ పరిమాణం కలిగిన QD మినీ ఎల్ఈడి స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ HDR 10+, 60Hz అండ్ గేమింగ్ 120Hz రిఫ్రెష్ రేట్ వాటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఇది 2GB ర్యామ్, 32GB స్టోరేజ్ తో క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ ఫైర్ టీవీ మరియు అలెక్సా సపోర్ట్ తో వస్తుంది. ఇది డాల్బీ ఆడియో మరియు DTS సపోర్ట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ Wi-Fi, బ్లూటూత్ HDMI, USB మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.