Flipkart సేల్ రేపటితో ముగుస్తుంది..ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ పైనఒక లుక్ వేయండి.!

HIGHLIGHTS

Flipkart Appliance Bonanza సేల్ రేపటితో ముగుస్తుంది

బిగ్ స్మార్ట్ టీవీని గొప్ప డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే అందుకునే అవాకాశాన్ని మిస్సవ్వకండి

నోకియా స్మార్ట్ టీవీ డీల్

ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళి సేల్ తరువాత ప్రకటించిన ,మరొక బిగ్ సేల్ Flipkart Appliance Bonanza సేల్ రేపటితో ముగుస్తుంది. ఈ సేల్ నుండి మీరు నోకియా బ్రాండ్ నుండి వచ్చిన బిగ్ స్మార్ట్ టీవీని గొప్ప డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే అందుకునే అవాకాశాన్ని మిస్సవ్వకండి. కేవలం బడ్జెట్ ధరలోనే నోకియా 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ అదీకూడా Dolby Vision మరియు Dolby Atmos సపోర్ట్ కలిగిన స్మార్ట్ టీవీని పొందవచ్చు. ఈ నోకియా స్మార్ట్ టీవీ డీల్ మరియు అఫర్ పైన ఒక లుక్ వేద్దామా.          

Nokia (43 inch) 4K UHD స్మార్ట్ టీవీ: ధర మరియు అఫర్

నోకియా యొక్కఈ  43 అంగుళాల స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి 40% డిస్కౌంట్ తో కేవలం రూ.23,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ని ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి Citi క్రెడిట్/డెబిట్ కార్డ్స్ మరియు EMI అప్షన్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, మరింత తక్కువ ధరకే ఈ నోకియా స్మార్ట్ టీవీని మీ సొంతం చేసుకోవచ్చు.    

Nokia (43 inch) 4K UHD స్మార్ట్ టీవీ: ప్రత్యేకతలు

Nokia (43 inch) 4K UHD స్మార్ట్ టీవీ యొక్క డిస్ప్లే 3840 × 2160 పిక్సెల్స్ రిజల్యూషన్‌ కలిగి ఉంది. అంటే, ఈ టీవీ అల్ట్రా హై డెఫినేషన్(UHD) 4K LED స్క్రీన్ కలిగివుంటుంది మరియు ఇది VA ప్యానల్. మీ టీవీ అనుభవాన్ని మరింతగా పెంచడానికి ఇందులో Dolby Vision సపోర్ట్ ను అందించింది. ఈ టీవీలో ఆండ్రాయిడ్ 11 OS తో గూగుల్ ప్లే స్టోర్ సౌకర్యం కూడా ఉంది. అదనంగా, వినియోగదారులు ఈ స్మార్ట్ టీవీలో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, Google Play  మరియు యూట్యూబ్ యాప్స్ డైరెక్ట్ బటన్ కలిగి ఉంటారు.

టీవీ యొక్క ఇతర ఫీచర్ల గురించి మాట్లాడితే, ఈ టీవీకి క్వాడ్ కోర్ ప్రాసెసర్ కి జతగా 2 GB ర్యామ్ + 16 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఇక ఆడియో విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీలో మంచి సౌండ్ కోసం Dolby Atmos సౌండ్ సిస్టమ్ లభిస్తుంది. కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్ టీవీ కనెక్షన్ కోసం Wi-Fi , బ్లూటూత్ మరియు HDMI  మరియు USB వంటి ఫీచర్లు అందించబడ్డాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :