flipkart bbd sale announces huge discount offer on iPhone 15
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఐఫోన్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఒక ఐఫోన్ కొనాలంటే లకారం వరకు చెల్లించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే, ఈ సమస్యను అధిగమించడానికి కొందరు ఐఫోన్ యొక్క పాత జనరేషన్ కొనడానికి మక్కువ చూపుతున్నారు. అందులోనూ ముఖ్యంగా iPhone 15 స్మార్ట్ ఫోన్ కొనడానికి ఎక్కువ సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఐఫోన్ డీల్స్ కోసం చూస్తున్న వారికి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ గుడ్ న్యూస్ అందించింది.
ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి అన్ని ఆఫర్స్ తో కలిపి అతి చవక ధరలో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ పైన అందించిన డీల్స్ మరియు ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందిస్తున్న డీల్ ప్రైస్ ను కూడా ఈరోజు రివీల్ చేసింది.ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందించిన బిగ్ డీల్స్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 63,999 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.
ఈ ఫోన్ 256GB వేరియంట్ ఇండియాలో రూ. 89,900 ప్రైస్ ట్యాగ్ తో రిలీజ్ అయ్యింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 256GB వేరియంట్ రూ. 69,900 ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా ఈ ఫోన్ పైన రూ. 3,495 రూపాయల ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ మరియు ఫ్లిప్ కార్ట్ SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. అలాగే, ఈ ఫోన్ పైన అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ ని కూడా జత చేసింది. అయితే, సేల్ నుంచి మరింత చవక ధరలో లభిస్తుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ సేల్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభం అవుతుంది.
Also Read: 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ ఇంత చవక రేటుకే సేల్ అవుతోందంటే ఎవరు నమ్మరు.!
ఐఫోన్ 15 ఫోన్ 6.1 ఇంచ్ సూపర్ రెటినా XDR స్క్రీన్ తో వస్తుంది. ఇది డైనమిక్ ఐల్యాండ్, సిరామిక్ గ్లాస్ సేఫ్టీ మరియు 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను యాపిల్ యొక్క A16 Bionic chip తో అందించింది. ఇందులో 256GB స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ IOS 27 కి కూడా అప్డేట్ అవుతుంది.
ఈ ఫోన్ లో వెనుక 48MP మెయిన్ కెమెరా జతగా 12MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 12MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 30FPS 4K వీడియో, సినిమాటిక్ మోడ్, Dolby Vision 4K 60FPS వీడియో వంటి ప్రీమియం కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 20 గంటల వీడియో ప్లే బ్యాక్ అందుంచే మన్నిక కలిగిన బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది.