బడ్జెట్ ధరలో 50 ఇంచ్ QLED Smart Tv కోసం చూస్తున్నారా.!
గతంలో ఒక QLED Smart Tv కొనాలంటే కనీసం 60 వేల రూపాయలు అయినా ఖర్చు చేయాల్సి వచ్చేది. అయితే, మారిన రోజులు మరియు పెరిగిన కాంపిటేషన్ తో ఇప్పుడు క్యూలెడ్ స్మార్ట్ టీవీలు 30 వేల రూపాయల కంటే తక్కువ ధరలో కూడా లభిస్తున్నాయి. మీరు కూడా మీ ఇంటికి తగిన కొత్త క్యూలెడ్ స్మార్ట్ టీవీ కొనాలని వెతుకుతుంటే, ఈరోజు మేము అందించిన ఈ రెండు బెస్ట్ టీవీ ఆప్షన్ లను పరిశీలించవచ్చు.
SurveyQLED Smart Tv
బడ్జెట్ యూజర్ ను దృష్టిలో ఉంచుకుని ఈ రోజు 30 వేల కంటే తక్కువ ధరలో లభిస్తున్న రెండు బెస్ట్ క్యూలెడ్ టీవీ ఆప్షన్ లను ఈరోజు అందిస్తున్నాను. ఈ రెండు టీవీలు కూడా మంచి ఫీచర్స్ ను కలిగి ఉంటాయి.
Thomson 50 ఇంచ్ QLED Smart Tv
థాంసన్ యొక్క ఈ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 4K QLED ప్యానల్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10+ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ HDMI, USB, ఆప్టికల్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Digital సౌండ్ సపోర్ట్ మరియు 40W సౌండ్ అందించే స్పీకర్స్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది.

ఈ థాంసన్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి డిస్కౌంట్ తో కేవలం రూ. 27,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ టీవీ పై 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ టీవీ బడ్జెట్ ధరలో వచ్చే బెస్ట్ 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ గా ఉంటుంది.
Also Read: Tecno Pop 9: ప్రీమియం డిజైన్ తో టెక్నో కొత్త ఫోన్ లాంచ్ అవుతోంది.!
Blaupunkt 50 ఇంచ్ QLED Smart Tv
ప్రముఖ జర్మన్ బ్రాండ్ బ్లౌపంక్ట్ యొక్క ఈ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ బెజెల్ లెస్ డిజైన్ తో వస్తుంది మరియు 4K QLED ప్యానల్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10+ సపోర్ట్ వస్తుంది మరియు గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.

ఈ టీవీ 60W సౌండ్ అందించే 4 స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు Dolby Digital Plus సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ HDMI, USB, బ్లూ టూత్ మరియు డ్యూయల్ బ్యాంక్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి డిస్కౌంట్ తో రూ. 28,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ టీవీ కూడా 30 వేల బడ్జెట్ ధరలో వచ్చే బెస్ట్ 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ అవుతుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile