BSNL Telangana Special Offer rs 51 offers 28 days unlimited benefits
BSNL Telangana Special Offer: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అందించింది. కేవలం రూ. 51 కే 28 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే లిమిటెడ్ ఆఫర్ ఒకటి తెలంగాణ ప్రజల కోసం తీసుకొచ్చింది. అయితే, ఈ ఆఫర్ కేవలం ఈ నెల రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి, ఈ ఆఫర్ క్లోజ్ అయ్యే లోపు ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసి ఈ ఆఫర్ అందించే అన్లిమిటెడ్ లాభాలు ఆనందించవచ్చు.
బిఎస్ఎన్ఎల్ తెలంగాణ టెలికాం ఈ కొత్త ఆఫర్ ను ప్రకటించింది. అదేమిటంటే, రూ. 51 రూపాయల రీఛార్జ్ తో 28 రోజుల అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఇందులో డైలీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు SMS వంటి అన్ని ప్రయోజనాలు ఉంటాయి. అయితే, ఈ ప్లాన్ అందుకోవాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి.
బిఎస్ఎన్ఎల్ ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను కేవలం బిఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్ల కోసం మాత్రమే అందించింది. అంటే, బిఎస్ఎన్ఎల్ కొత్త SIM కార్డు తీసుకుని చేసే ఈ రూ. 51 రూపాయల ఆఫర్ తో ఫస్ట్ రీఛార్జ్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ ప్లాన్ బెనిఫిట్స్ మీకు లభిస్తాయి. మరి ఈ ఆఫర్ తో వచ్చే పూర్తి లాభాలు ఏమిటో కూడా చూద్దామా.
Also Read: Xiaomi 17T: ప్రీమియం కెమెరాతో వచ్చిన షియోమీ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఇవిగో.!
బిఎస్ఎన్ఎల్ రూ. 51 లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 28 రోజుకు వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 28 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో డైలీ 2GB హై స్పీడ్ డేటా అందిస్తుంది మరియు ఈ డైలీ డేటా ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో డైలీ ఉచిత 100 SMS బెనిఫిట్ కూడా మీకు లభిస్తుంది.
ఓవరాల్ గా ఈ రూ. 51 రోజుల ఆఫర్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 28 రోజులు ఉచిత అన్లిమిటెడ్ లాభాలు లభిస్తాయి. అంతేకాదు, బిఎస్ఎన్ఎల్ యొక్క లేటెస్ట్ SIM కార్డ్ కూడా మీకు ఉచితంగా లభిస్తుంది. చాలా చవక ధరలో బిఎస్ఎన్ఎల్ అనేకమైన ప్రీపెయిడ్ ప్లాన్ లను అందిస్తోంది, కేవలం రూ. 153 రూపాయల అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ ,మొదలుకొని రూ. 2,399 రూపాయల అన్లిమిటెడ్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ వరకు చాలా బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ బిఎస్ఎన్ఎల్ అంబుల పొదలో ఉన్నాయి.