Xiaomi 17T: ప్రీమియం కెమెరాతో వచ్చిన షియోమీ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఇవిగో.!

HIGHLIGHTS

షియోమీ 17 టి స్మార్ట్ ఫోన్ ని ఎట్టకేలకు ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది

Leica ప్రీమియం కెమెరా సెటప్ మరియు కళ్ళు చెదిరే కాంపాక్ట్ డిజైన్ తో లాంచ్ చేసింది

ఈ ఫోన్ పై భారీ లాంచ్ ఆఫర్స్ కూడా షియోమీ ప్రకటించింది

Xiaomi 17T: ప్రీమియం కెమెరాతో వచ్చిన షియోమీ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఇవిగో.!

Xiaomi 17T: షియోమీ గత కొంత కాలంగా టీజింగ్ చేస్తున్న షియోమీ 17 టి స్మార్ట్ ఫోన్ ని ఎట్టకేలకు ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను Leica ప్రీమియం కెమెరా సెటప్ మరియు కళ్ళు చెదిరే కాంపాక్ట్ డిజైన్ తో లాంచ్ చేసింది. షియోమీ సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Xiaomi 17T: ప్రైస్

షియోమీ 17 టి స్మార్ట్ ఫోన్ ను రూ. 59,999 రూపాయల ధరతో ఇండియాలో విడుదల చేసింది. ఈ ఫోన్ పై భారీ లాంచ్ ఆఫర్స్ కూడా షియోమీ ప్రకటించింది. ఈ ఫోన్ పై రూ. 5,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 5,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ ని ప్రకటించింది. వీటిలో ఏదైనా ఒక ఆఫర్ మాత్రమే లభిస్తుంది.

Xiaomi 17T price and features

ఈ స్మార్ట్ ఫోన్ పై మరిన్ని అదనపు ఆఫర్స్ కూడా షియోమీ అందించింది. ఈ ఫోన్ పై 60% వన్ ఇయర్ బై బ్యాక్ వాల్యూ ఆఫర్ కూడా అందించింది. 3 నెలల యూట్యూబ్ ప్రీమియం, 4 నెలల Spotify ప్రీమియం యాక్సెస్ మరియు 3 నెలల గూగుల్ AI ప్రో యాక్సెస్ వంటి ఆఫర్స్ కూడా ఈ ఫోన్ తో అందించింది. జూన్ 10 వ తేదీ ఈ ఫోన్ ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది.

Also Read: Motorola Edge 70 Pro Plus: ప్రీమియం ఫీచర్స్ తో మిడ్ రేంజ్ ప్రైస్ లో లాంచ్ అయ్యింది.!

Xiaomi 17T: ఫీచర్స్

షియోమీ 17 టి స్మార్ట్‌ ఫోన్ ప్రీమియం ఫీచర్ల తో ప్రీమియం ప్రైస్ తో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.59 ఇంచ్ 1.5K AMOLED డిస్‌ప్లే అందించబడింది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR 10+, Dolby Vision సపోర్ట్, 3500 నిట్స్ పీక్ బ్రైట్‌ నెస్ మరియు గొరిల్లా గ్లాస్ 7i రక్షణ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి అద్భుతమైన విజువల్ అనుభవాన్ని అందిస్తుంది.

ఈ ఫోన్ లో గొప్ప పెర్ఫార్మెన్స్ అందించే MediaTek Dimensity 8500 Ultra (4nm) ప్రాసెసర్‌ ను అందించింది. ఈ చిప్ సెట్ తో జతగా 12GB LPDDR5X RAM మరియు 512GB UFS 4.1 ఫాస్ట్ రెస్పాన్స్ స్టోరేజ్‌ అందించింది. ఈ ఫోన్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ మరియు AI ఆధారిత పనులు చాలా వేగంగా నిర్వహించే శక్తి కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Hyper OS 3 సాఫ్ట్ వేర్ పై పనిచేస్తుంది.

కెమెరా విభాగంలో, ఈ ఫోన్ Leica ట్యూనింగ్‌ 50MP OIS మెయిన్ కెమెరా, 50MP 5x టెలిఫోటో పెరిస్కోప్ లెన్స్ మరియు 12MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అలాగే, ఫోన్ ముందు భాగంలో సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందించబడింది. ఈ ఫోన్ జబర్దస్త్ 5x ఆప్టికల్ జూమ్, హై క్వాలిటీ పోర్ట్రెయిట్స్ మరియు 60FPS 4K వీడియో రికార్డింగ్‌ సపోర్ట్ తో వస్తుంది.

ఈ లేటెస్ట్ షియోమీ ఫోన్‌ లో 6500mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 67W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు ఇతర డివైజెస్ ను ఛార్జ్ చేసే రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ ఉంది. Dolby Atmos సపోర్ట్ కలిగిన స్టీరియో స్పీకర్లు మరియు IP68 వాటర్ డస్ట్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile