సాధారణ 55 ఇంచ్ LED టీవీ రేటుకే 4K Mini LED Smart Tv అందుకోండి.!
సాధారణ 55 ఇంచ్ LED టీవీ రేటుకే 4K Mini LED Smart Tv అందుకునే అవకాశం మీకోసం ఎదురు చూస్తోంది
మార్కెట్లో విడుదలైన బ్రాండ్ న్యూ 55 ఇంచ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ బెస్ట్ ప్రైస్ లో లభిస్తుంది
ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2GB ర్యామ్ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది
సాధారణ 55 ఇంచ్ LED టీవీ రేటుకే 4K Mini LED Smart Tv అందుకునే అవకాశం ఈరోజు మీకోసం ఎదురు చూస్తోంది. అది కూడా ఇండియన్ మార్కెట్లో విడుదలైన బ్రాండ్ న్యూ 55 ఇంచ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ ఈ ప్రైస్ లో లభిస్తుంది. మీ ఇంటికి తగిన స్మార్ట్ టీవీ కొనాలని గత కొంత కాలంగా వెతికి వెతికి నిరుత్సాహపడి విసిగి పొతే ఈరోజు మేము అందించిన ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేయండి.
Survey4K Mini LED Smart Tv : డీల్
ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Coocaa ఇటీవల ఇండియాలో విడుదల చేసిన 55 ఇంచ్ మినీ ఎల్ఈడి 55 MINI 75Q మోడల్ ఈరోజు తక్కువ ధరలో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఈ స్మార్ట్ టీవీని 49% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 32,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. వాస్తవానికి, సోనీ, ఎల్ జి మరియు శామ్సంగ్ వంటి బ్రాండ్ సాధరణ స్మార్ట్ టీవీలు మాత్రమే ఈ ధరలో లభిస్తాయి. అయితే, ఈ 55 ఇంచ్ 4కె మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ మీకు ఈరోజు ఈ బడ్జెట్ ధరలో లభిస్తుంది.
4K Mini LED Smart Tv : ఫీచర్స్
ఇది కూకా అందించిన 55 అంగుళాల UHD 4K మినీ ఎల్ఈడి స్మార్ట్ గూగుల్ టీవీ. ఇది 2025 లో అందించిన లేటెస్ట్ ఎడిషన్ మరియు అత్యాధునిక డిస్‌ప్లే టెక్నాలజీతో రూపొందించబడింది. ఇందులో మినీ ఎల్ఈడి ప్యానెల్ మరియు లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీ ఉండటంతో మరింత డీప్ బ్లాక్స్ తో పాటు మెరుగైన కాంట్రాస్ట్ మరియు అద్భుతమైన చిత్ర నాణ్యతను అందిస్తుంది.

ఈ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్, Dolby Vision, HDR10+ మరియు వైడ్ కలర్ గాముట్ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్, బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్ మరియు ప్లే స్టోర్ తో పాటు ప్రముఖ OTT యాప్ లకు సపోర్ట్ లభిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2GB ర్యామ్ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.
ఆడియో విభాగంలో, ఈ టీవీ 36W స్పీకర్ సిస్టమ్ కలిగి ఉంటుంది. అంతేకాదు, Dolby Atmos, డాల్బీ ఆడియో మరియు డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్‌తో థియేటర్ తరహా సౌండ్ అనుభూతిని అందిస్తుంది. ఈ టీవిలో HDMI, USB, బ్లూటూత్ , డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు ఇతర స్మార్ట్ కనెక్షన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Also Read: లేటెస్ట్ boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ పై గొప్ప డిస్కౌంట్ అందించిన ఫ్లిప్ కార్ట్.!
ఇక ఈ స్మార్ట్ టీవీ డీల్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రీమియం డిజైన్, శక్తివంతమైన మినీ ఎల్ఈడి డిస్‌ప్లే మరియు డాల్బీ అట్మోస్ ఆడియోతో వంటి ప్రీమియం ఫీచర్స్ తో హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ను కొత్త స్థాయికి తీసుకెళ్లే ప్రీమియం స్మార్ట్ టీవీ గా ఇది నిలుస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
