రూ. 20,000 కంటే తక్కువ రేటుకే 43 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.!

HIGHLIGHTS

చవక ధరలో కొత్త స్మార్ట్ టీవీ డీల్స్ కోసం చూస్తుంటే ఈరోజు ఈ డీల్ మీ కోసమే

కేవలం రూ. 20,000 కంటే తక్కువ రేటుకే 43 ఇంచ్ QLED Smart Tv ఈరోజు లభిస్తోంది

ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ మరియు ఫీచర్స్ కూడా వివరంగా అందించాము

రూ. 20,000 కంటే తక్కువ రేటుకే 43 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.!

చవక ధరలో కొత్త స్మార్ట్ టీవీ డీల్స్ కోసం చూస్తుంటే ఈరోజు ఈ డీల్ మీ కోసమే అనుకోండి. ఎందుకంటే, కేవలం రూ. 20,000 కంటే తక్కువ రేటుకే 43 ఇంచ్ QLED Smart Tv ఈరోజు లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ఇటీవలే లాంచ్ అయ్యింది మరియు ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలో మీకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ మరియు ఫీచర్స్ కూడా వివరంగా అందించాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

43 ఇంచ్ QLED Smart Tv ఆఫర్

ఈ బిగ్ స్మార్ట్ టీవీ ఆఫర్ ని ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించింది. అదేమిటంటే, థాంసన్ రీసెంట్ గా విడుదల చేసిన 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ (43TJQ0012) మోడల్ పై ఫ్లిప్ కార్ట్ 31% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 20,799 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ నుంచి ఫ్లిప్ కార్ట్ SBI మరియు ఫ్లిప్ కార్ట్ Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1753 రూపాయల అదనపు తగ్గింపు కూడా అందిస్తుంది.

43 inch qled smart tv offer

ఈ రోజు ఈటీవీ పై ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ రెండు ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 19,046 రూపాయల అతి చవక ధరలో మీకు లభిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రైస్ లో లభిస్తున్న ఏకైక 43 ఇంచ్ 4K క్యూలెడ్ స్మార్ట్ టీవీగా ఇది నిలుస్తుంది.

Also Read: లేటెస్ట్ ఫ్లోర్ స్టాండ్ 5.1 Dolby సౌండ్ బార్ పై అమెజాన్ లిమిటెడ్ పీరియడ్ డిస్కౌంట్ అందుకోండి.!

43 ఇంచ్ QLED Smart Tv ఫీచర్స్

ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ బాగానే ఉంది, మరి ఫీచర్స్ మాటేమిటి అని ఆలోచిస్తున్నారా? ఈ స్మార్ట్ టీవీ ఫీచర్స్ కూడా బాగానే ఉంటాయి. ఇది మంచి బెజెల్ లెస్ డిజైన్ తో వస్తుంది మరియు 43 ఇంచ్ క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇందులో ARM Cortex A53 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్ మరియు 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి.

ఈ స్మార్ట్ టీవీ Jio Tele OS తో పని చేస్తుంది మరియు 400 కంటే ఎక్కువ ఉచిత ఛానల్స్ కూడా ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ 4K HDR సపోర్ట్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో ఆకట్టుకునే విజువల్స్ కూడా అందిస్తుంది. సౌండ్ పరంగా, ఈ థాంసన్ స్మార్ట్ టీవీ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 40W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఇది డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB, ఆప్టికల్ అవుట్, AV ఇన్, ఈథర్నెట్ వంటి మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.

ఓవరాల్ గా చెప్పాలంటే, ఈ టీవీ 19 వేల రూపాయల బడ్జెట్ ధరలో డబ్బుకు తగిన ప్రయోజనాలు అందించే సత్తా కలిగిన టీవీ ఆఫర్ గా నిలుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile