లేటెస్ట్ ఫ్లోర్ స్టాండ్ 5.1 Dolby సౌండ్ బార్ పై అమెజాన్ లిమిటెడ్ పీరియడ్ డిస్కౌంట్ అందుకోండి.!
లేటెస్ట్ ఫ్లోర్ స్టాండ్ 5.1 Dolby సౌండ్ బార్ పై అమెజాన్ లిమిటెడ్ పీరియడ్ డిస్కౌంట్ అందుకోండి
జెబ్రోనిక్స్ రెండు నెలల క్రితం విడుదల చేసిన లేటెస్ట్ సౌండ్ బార్ పై అమెజాన్ ఈ ఆఫర్ అందించింది
రియర్ స్పీకర్లు సెట్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా చాలా అందమైన ఫ్లోర్ స్టాండ్ తో కూడా వస్తుంది
లేటెస్ట్ ఫ్లోర్ స్టాండ్ 5.1 Dolby సౌండ్ బార్ పై అమెజాన్ లిమిటెడ్ పీరియడ్ డిస్కౌంట్ అందుకోండి. జెబ్రోనిక్స్ రెండు నెలల క్రితం విడుదల చేసిన లేటెస్ట్ సౌండ్ బార్ పై అమెజాన్ ఈ ఆఫర్ అందించింది. ఈ సౌండ్ బార్ కంప్లీట్ 5.1 డాల్బీ ఆడియో సెటప్ తో వస్తుంది మరియు రియర్ స్పీకర్లు సెట్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా చాలా అందమైన ఫ్లోర్ స్టాండ్ తో కూడా వస్తుంది.
Surveyఏమిటా 5.1 Dolby సౌండ్ బార్ ఆఫర్?
Zebronics రీసెంట్ గా విడుదల చేసిన 5.1 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ Juke BAR 9535 ఈరోజు అమెజాన్ డిస్కౌంట్ ఆఫర్ అందుకుంది. ఈ సౌండ్ బార్ ను జెబ్రోనిక్స్ రూ. 13,999 రూపాయల ధరలో విడుదల చేసింది. అయితే, అమెజాన్ ఈ సౌండ్ బార్ పై రూ. 2,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందించి, కేవలం రూ. 11,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది.

పైన అందించిన ఆఫర్ కేవలం లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అని అమెజాన్ ఈ ఆఫర్ గురించి పేర్కొంది. అంతేకాదు, ఈ అఫర్ తో పాటు అధనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా ఈ సౌండ్ బార్ పై అందించింది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ నుంచి Amazon Pay ICICI క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 1,250 డిస్కౌంట్ మరియు SBI క్రెడిట్ కార్డు తో కొనేవారికి రూ. 1,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 10,999 కంటే తక్కువ ధరలో లభిస్తుంది.
Also Read: iQOO Z11xa: సైలెంట్ గా జెడ్ 11 సిరీస్ నుండి కొత్త ఫోన్ లాంచ్ చేసిన ఐకూ.!
5.1 Dolby సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో మరో మంచి విషయం ఏమిటంటే, ఈ సౌండ్ బార్ తో వచ్చే రియర్ శాటిలైట్ స్పీకర్ లను సెట్ చేసుకోవడానికి ప్రత్యేకమైన స్టాండ్ లను కూడా అందిస్తుంది. ఇది పర్ఫెక్ట్ హైట్ తో పాటు పర్ఫెక్ట్ దూరంలో ఉండేలా సెట్ చేయబడి ఉంటుంది. కాబట్టి ఇది పర్ఫెక్ట్ సరౌండ్ సౌండ్ అందించే విధంగా ఉంటుంది. ఇది ప్రీమియం డిజైన్ మరియు గొప్ప స్పీకర్ సెటప్ తో ఉంటుంది.
ఈ సౌండ్ బార్ ముందు మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ రియర్ శాటిలైట్ స్పీకర్ మరియు సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 525W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. అలాగే, ఈ సౌండ్ బార్ కలిగిన డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో సినిమా థియేటర్ వంటి గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇందులో బ్లూటూత్, HDMI Arc, ఆప్టికల్, USB, మరియు AUX వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
