iQOO Z11xa: సైలెంట్ గా జెడ్ 11 సిరీస్ నుండి కొత్త ఫోన్ లాంచ్ చేసిన ఐకూ.!

HIGHLIGHTS

ఐకూ ఈరోజు ఐకూ జెడ్ 11xa స్మార్ట్ ఫోన్ ను చాలా సైలెంట్ గా విడుదల చేసింది

iQOO Z11xa ను అదే జెడ్ 11 సిరీస్ డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ తో విడుదల చేసింది

ఈ ఫోన్ తో గొప్ప కూపన్ డిస్కౌంట్ కూపన్ ఆఫర్ ని ఐకూ అందించింది

iQOO Z11xa: సైలెంట్ గా జెడ్ 11 సిరీస్ నుండి కొత్త ఫోన్ లాంచ్ చేసిన ఐకూ.!

iQOO Z11xa: రీసెంట్ గా ఐకూ జెడ్ 11 సిరీస్ నుంచి జెడ్ 11x ఫోన్ లాంచ్ చేసిన ఐకూ, ఈరోజు ఐకూ జెడ్ 11xa స్మార్ట్ ఫోన్ ను చాలా సైలెంట్ గా విడుదల చేసింది. ఈ ఫోన్ ను అదే జెడ్ 11 సిరీస్ డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ తో విడుదల చేసింది. ఈ ఫోన్ వేగవంతమైన చిప్ సెట్, బిగ్ బ్యాటరీ మరియు ఇతర ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఈ లేటెస్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ వివరాలు తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iQOO Z11xa: ప్రైస్ అండ్ ఆఫర్స్

ఐకూ జెడ్11xa స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఐకూ విడుదల చేసింది. ఈ ఫోన్ ను మిడ్ రేంజ్ యూజర్ బేస్ ను టార్గెట్ చేస్తూ రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ను రూ. 28,999 ప్రైస్ తో ఇండియన్ మార్కెట్ లో పరిచయం చేసింది. సెప్టెంబర్ 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ మొదటి సేల్ ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

iQOO Z11xa

ఆఫర్స్:

ఈ ఫోన్ తో గొప్ప కూపన్ డిస్కౌంట్ కూపన్ ఆఫర్ ని ఐకూ అందించింది. ఇది ప్రత్యేకమైన లాంచ్ ఆఫర్ మరియు మొదటి రోజు సేల్ నుంచి మాత్రమే లభిస్తుంది. అదేమిటంటే, ఈ ఫోన్ ను మొదటి రోజు సేల్ నుంచి కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,500 అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ డిస్కౌంట్ తో ఈ ఫోన్ రూ. 27,499 రూపాయల ధరలో లభిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ పై 6 నెలల No Cost EMI ఆఫర్ ని కూడా అందించింది.

Also Read: MIVI One 5G: ప్రీమియం డిజైన్ తో హైదరాబాద్ బేస్డ్ కంపెనీ 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్.!

iQOO Z11xa: ఫీచర్స్

ఐకూ ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను 6.76 ఇంచ్ LCD స్క్రీన్ తో లాంచ్ చేసింది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7400 5జి చిప్ సెట్ తో అందించింది. ఇది 8,90,000 కంటే అధిక AnTuTu స్కోర్ అందించే శక్తి కలిగి ఉంటుంది మరియు జతగా 8GB ర్యామ్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ఈ కెమెరాలో 50MP Sony మెయిన్ కెమెరా OIS సపోర్ట్ తో ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ ముందు మరియు వెనుక కెమెరా కూడా 4K వీడియో సపోర్ట్ తో వస్తాయి. అలాగే ఈ ఫోన్ లో ఐకూ ప్రత్యేకమైన కెమెరా ఫీచర్స్ మరియు లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా ఐకూ అందించింది.

ఇక ఈ ఫోన్ కలిగిన బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 7900 భారీ బ్యాటరీని ఐకూ సెట్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ లో బైపాస్ ఛార్జ్ సపోర్ట్, 44W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ లో 4D గేమింగ్ వైబ్రేషన్ మరియు ఏఐ గేమ్ చేంజర్ తో కూడా వస్తుంది. ఇది ఆరిజిన్ OS 6 తో జతగా లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అయ్యింది. అలాగే 4 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అందుకుంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile