MIVI One 5G: ప్రీమియం డిజైన్ తో హైదరాబాద్ బేస్డ్ కంపెనీ 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్.!

HIGHLIGHTS

మివి కొత్తగా స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తునట్లు అనౌన్స్ చేసింది

MIVI One 5G స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం డిజైన్ తో లాంచ్ చేస్తోంది

ఈ ఫోన్ డిజైన్ వెల్లడించే ఇమేజ్ మరియు రిలీజ్ డేట్ ని రివీల్ చేసింది

MIVI One 5G: ప్రీమియం డిజైన్ తో హైదరాబాద్ బేస్డ్ కంపెనీ 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్.!

MIVI One 5G: హైదరాబాద్ బేస్డ్ ఆడియో ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ మివి ఇండియన్ మార్కెట్లో కొత్తగా స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తునట్లు అనౌన్స్ చేసింది. ఇప్పటి వరకు కేవలం TWS బడ్స్, సౌండ్ బార్ మరియు ఇతర ఆడియో ప్రోడక్ట్స్ మాత్రమే అందించిన ఈ కంపెనీ, ఇప్పుడు మోడల్ మార్కెట్లోకి కూడా అడుగుపెట్టింది. ఈ కంపెనీ లాంచ్ చేయబోతున్న మొదటి ఫోన్ మివి వన్ 5జి స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం డిజైన్ తో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్ కోసం అందించిన టీజర్ నుంచి ఈ ఫోన్ డిజైన్ వెల్లడించే ఇమేజ్ మరియు రిలీజ్ డేట్ ని రివీల్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

MIVI One 5G: లాంచ్ డేట్

మివి లాంచ్ చేయబోతున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబర్ 24వ తేదీ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా అందించిన ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజీ తో టీజింగ్ చేస్తోంది. ఈ టీజర్ పేజీ నుంచి లాంచ్ డేట్, టీజర్ ఇమేజ్ ను విడుదల చేసింది మరియు త్వరలో మరిన్ని ఫీచర్లు కూడా అదే పేజీ నుంచి రివీల్ చేస్తుంది.

MIVI One 5G: ఫీచర్స్

మివి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ని ఇంకా పూర్తిగా రివీల్ చేయలేదు. అయితే ఈ ఫోన్ డిజైన్ ద్వారా ఈ ఫోన్ కెమెరా మరియు డిజైన్ వివరాలు వెల్లడించింది. ఈ ఫోన్ ఇమేజ్ ప్రకారం, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ చూడటానికి దాదాపు ఐఫోన్ 16 మాదిరి డిజైన్ తో ఉంటున్నట్లు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అయితే, ఈ ఫోన్ పూర్తిగా ఐఫోన్ 16 ఫోన్ డిజైన్ తో ఉండదని గమనించాలి. చూడటానికి ఆ విధంగా మాత్రమే కనిపిస్తుంది.

MIVI One 5G

ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ మెటల్ బడి డిజైన్ తో ఉన్నట్లు అనిపిస్తోంది. అయితే, ఈ ఫీచర్ గురించి కంపెనీ అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు మనం ఇది అంచనా ఫీచర్ గా మాత్రమే చూడాలి. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు క్లియర్ గా కనిపిస్తోంది. ఈ ఫోన్ సరికొత్త గ్రీన్ కలర్ లో లాంచ్ అవుతోంది.

Also Read: GPT-6 Astra: అత్యంత శక్తివంతమైన AI మోడల్ రిలీజ్ చేసిన open AI

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను లేటెస్ట్ క్వాల్కమ్ Snapdragon 5G చిప్ సెట్ తో లాంచ్ చేస్తునట్లు మివి వెల్లడించింది. ఈ ప్రాసెసర్ వివరాలు ఇంకా అనౌన్స్ చేయలేదు. త్వరలోనే ఈ అప్ కమింగ్ ఫోన్ కీలక ఫీచర్లు మరియు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఎలాంటి ఫీచర్స్ తో మార్కెట్ లో అడుగుపెడుతోందో తెలియాలంటే మరి కొంత సమయం వేచి చూడాలి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile