best budget 65 inch 4K Smart Tv deal today 26 may 2026
బెస్ట్ బడ్జెట్ ప్రైస్ లో 65 ఇంచ్ 4K Smart Tv ఆఫర్ కోసం చూస్తున్నారా? అయితే, మీకోసం ఈరోజు బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ అందుబాటులో ఉంది. ఇటీవల విడుదలైన ఒక 65 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ తో రీజనబుల్ ప్రైస్ లో లభిస్తుంది. మీ ఇంటికి తగిన 65 ఇంచ్ స్మార్ట్ టీవీని రూ. 35,000 రూపాయల ధరలో అందుకోవాలని చూసే కొనుగోలుదారులు ఈ టీవీ డీల్ ను పరిశీలించవచ్చు.
ఇండియాలో realme TechLife సంవత్సరం విడుదల చేసిన 65 ఇంచ్ స్మార్ట్ టీవీ (65UHDGDRWSDB) మోడల్ ఈరోజు బెస్ట్ బడ్జెట్ ప్రైస్ లో లభిస్తుంది. ఎందుకంటే, ఫ్లిప్ కార్ట్ ఈ స్మార్ట్ టీవీ పై 53% భారీ డిస్కౌంట్ అందించి రూ. 37,999 ఆఫర్ ధరలో చేస్తోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 36,499 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ లో 55 ఇంచ్ స్మార్ట్ టీవీలు లభిస్తుండగా మీరు ఈ 65 ఇంచ్ స్మార్ట్ టీవీని మీ సొంతం చేసుకోవచ్చు.
Also Read: PM Modi పొదుపు చర్యల పై కీలక వ్యాఖ్యలు చేసిన నిర్మలా సీతారామన్.!
ఈ స్మార్ట్ టీవీ 65 ఇంచ్ పరిమాణం కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, HDR 10, 4K అప్ స్కేలింగ్ మరియు MEMC ఫీచర్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ రియల్ మీ టెక్ లైఫ్ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
సౌండ్ పరంగా, ఈ స్మార్ట్ టీవీ రెండు స్పీకర్లు కలిగి 30W సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB, ఆప్టికల్ మరియు AV ఇన్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ ప్రీమియం మెటాలిక్ బెజెల్ లెస్ డిజైన్ కలిగి ఉంటుంది.