అండర్ రూ. 10,000 ధరలో లభించే బెస్ట్ 32 ఇంచ్ QLED Smart Tv లు ఇవే.!
ఇండియన్ మార్కెట్లో లభిస్తున్న బడ్జెట్ స్మార్ట్ టీవీ
అండర్ రూ. 10,000 ధరలో లభించే బెస్ట్ 32 ఇంచ్ QLED Smart Tv
కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి బెస్ట్ టీవీ వివరాలు
ఇండియన్ మార్కెట్లో లభిస్తున్న బడ్జెట్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారి కోసం అందుబాటులో ఉన్న బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ టీవీ వివరాలు ఈ రోజు అందిస్తున్నాము. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, అండర్ రూ. 10,000 ధరలో లభించే బెస్ట్ 32 ఇంచ్ QLED Smart Tv ల వివరాలు ఈ రోజు అందిస్తున్నాను. కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి ఈరోజు మేము అందించిన బెస్ట్ టీవీ వివరాలు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము.
SurveyQLED Smart Tv
భారత మార్కెట్లో ప్రస్తుతం స్మార్ట్ టీవీలు మంచి చౌక ధరలో లభిస్తున్నాయి. కంపెనీల మధ్య పెరిగిన కాంపిటీషన్ మరియు ఉత్పత్తి కారణంగా స్మార్ట్ టీవీలు ఇప్పుడు అందుబాటులో ధరలో లభిస్తున్నాయి. అందుకే, ఈరోజు మంచి ఫీచర్స్ కలిగి క్వాడ్ ఎల్ఈడి టెక్ తో వచ్చిన బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ టీవీ వివరాలు అందిస్తున్నాము.
JVC (32) AI Vision Smart Tv
ప్రముఖ జపనీస్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 10,000 రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. అయితే, ఈ స్మార్ట్ టీవీ చౌక ధరలో ఎక్కువ ఫీచర్లను అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HD రెడీ రిజల్యూషన్ కలిగిన 32 ఇంచ్ పరిమాణం కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR మరియు HLG సపోర్ట్ కలిగి గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో నడుస్తుంది మరియు 1 జీబీ ర్యామ్ జతగా 8 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ జేవిసి స్మార్ట్ టీవీ Dolby Digital Plus సౌండ్ సపోర్ట్ కలిగిన 48W సౌండ్ అవుట్ పుట్ తో గొప్ప సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB, AV ఇన్, ఆప్టికల్ మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి కేవలం రూ. 9,299 రేటుకే ల లభిస్తుంది. Buy From Here
Also Read: డ్యూయల్ సబ్ ఉఫర్ Dolby Audio Soundbar కోసం చూస్తున్న వారికి బెస్ట్ డీల్.!
MOTOROLA (32) QLED Smart Tv
ఈ మోటోరోలా స్మార్ట్ టీవీ కూడా కేవలం రూ. 10,000 బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ టీవీ గా నిలుస్తుంది. ఈ టీవీ కూడా 32 ఇంచ్ పరిమాణం కలిగిన క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ కూడా క్వాడ్ కోర్ చిప్ సెట్, 1 జీబీ ర్యామ్ మరియు 8 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10 సపోర్ట్ కలిగి ఆకట్టుకునే విజువల్స్ కూడా అందిస్తుంది. ఈ టీవీ అంచులు లేని బెజెల్ లెస్ డిజైన్ తో ఉంటుంది.

ఈ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 40W సౌండ్ అవుట్ పుట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ కూడా బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్, ఈథర్నెట్, AV ఇన్, HDMI, USB మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి కేవలం రూ. 10,490 ధరకే లభిస్తుంది.
ఈ రెండు క్యూలెడ్ టీవీ లు కూడా 10 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ టీవీ లిస్ట్ లిస్ట్ లో నిలుస్తాయి.