55 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ Dolby Smart Tv అందుకోండి .. సేల్ ముగిసిన తర్వాత కూడా ఆగని ఆఫర్లు.!

HIGHLIGHTS

సేల్ ముగిసిన తర్వాత కూడా అమెజాన్ ఇండియా భారీ డీల్స్ అండ్ ఆఫర్లు అందించింది

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 నిన్నటితో ముగిసింది

కేవలం 55 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ Dolby Smart Tv అందుకోవచ్చు

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 నిన్నటితో ముగిసింది. అయితే, సేల్ ముగిసిన తర్వాత కూడా అమెజాన్ ఇండియా భారీ డీల్స్ అండ్ ఆఫర్లు అందించింది. ఈరోజు చాలా ప్రొడక్ట్స్ పై గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ అమెజాన్ అందించింది. ఈ ఆఫర్స్ ఎంత గొప్పగా ఉన్నాయి అంటే, కేవలం 55 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ Dolby Smart Tv అందుకోవచ్చు. అందుకే, ఈ బిగ్ టీవీ డీల్ గురించి కంప్లీట్ ఇన్ఫో అందించాను.

65 ఇంచ్ Dolby Smart Tv ఆఫర్

ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ TCL యొక్క ఉప బ్రాండ్ iFFALCON లేటెస్ట్ గా విడుదల చేసిన 65 ఇంచ్ టీవీ ఈరోజు ఈ ఆఫర్ ధరలో లభిస్తుంది. ఇక డీల్ వివరాల్లోకి వెళితే, ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీని అమెజాన్ ఈరోజు 67% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 39,999 ధరలో సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీని ఏదైనా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 2,000 రూపాయల భారీ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది.

ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 37,999 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. ఈ ప్రైస్ లో కేవలం 55 ఇంచ్ స్మార్ట్ టీవీలు మాత్రమే మార్కెట్లో లభిస్తుండగా, ఈ ఐఫాల్కన్ 65 ఇంచ్ టీవీని మీరు ఈ బడ్జెట్ ధరలో అందుకోవచ్చు. Buy From Here

Also Read : వీధి మొత్తాన్ని అల్లాడించే 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ ని అతి ధరలో పొందండి.!

iFFALCON 65 Dolby Smart Tv : ఫీచర్స్

ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ 65 ఇంచ్ LED స్క్రీన్ ను 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ గేమింగ్ మరియు కంటెంట్ కోసం DLG 120 / VRR 120 రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10, డాల్బీ విజన్ మరియు MEMC వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ మెటాలిక్ బెజెల్ లెస్ డిజైన్ కలిగి చాలా ప్రీమియం లుక్ తో వస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఇది 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.

సౌండ్ పరంగా, ఈ టీవీలో రెండు స్పీకర్లు ఉంటాయి మరియు ఇది 24W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఇందులో డాల్బీ అట్మోస్ మరియు DTS X రెండు సౌండ్ సపోర్ట్ ఉండటంతో ఇది మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ HDMI, USB, ఆప్టికల్ అవుట్ పుట్, డ్యూయల్ వై-ఫై, బ్లూటూత్, ఈథర్నెట్ మరియు మరిన్ని కనెక్టివిటీ ఆప్షన్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :