50 అంగుళాల FHD ఆండ్రాయిడ్ LED టీవీ కేవలం రూ.24,999 ధరకే తీసుకొచ్చిన KODAK

Updated on 10-Jun-2019
HIGHLIGHTS

సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, తన కొత్త కోడాక్ సిరిస్ నుండి KODAK 43FHDXPRO మరియు 50FHDXPRO ఆండ్రాయిడ్ టీవీ లను అతితక్కువ ధరకే ఇండియాలో విడుదల చేసింది.

ఇండియాలో టీవీ మరియు ఎలక్ట్రానిక్స్ తయారీదారు అయినటువంటి, సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, తన కొత్త కోడాక్ సిరిస్ నుండి KODAK 43FHDXPRO మరియు  50FHDXPRO  ఆండ్రాయిడ్ టీవీ లను అతితక్కువ ధరకే ఇండియాలో విడుదల చేసింది. ఇవి కేవలం ఆండ్రాయిడ్ టీవీలు మాత్రమేకాకుండా, ఇవి 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజితో పాటుగా వస్తాయి. 

కోడాక్ 43FHDXPRO  :ధర & ప్రత్యేకతలు

కోడాక్ 43FHDXPRO ధర – Rs.20,999  
ఇక ఈ స్మార్ట్ టీవీ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఇది 1920 X 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల FHD LED టీవీ మరియు ఇది 1.3 GHz క్లాక్ స్పీడ్ కలిగిన Cortex CA53 డ్యూయల్  కోర్ ప్రాసెసరుతో వస్తుంది. అలాగే,  ఇది Android 5.1 వెర్షన్ తో నడుస్తుంది మరియు ఇన్ బిల్ట్ WiFi కూడా అందించబడినది. అధనంగా, ఈ స్మార్ట్ టీవీ 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజిని కూడా కలిగివుంటుంది. సౌండ్ విషయానికి వస్తే, ఇది స్టాండర్డ్, మైల్డ్, యూజర్ మరియు డైనమిక్ వంటి ఎంపికలతో వస్తుంది. ఈ టీవీ ఈ రోజు నుండి Flipkart ద్వారా అందుబాటులో ఉంటుంది.            

కోడాక్ 50FHDXPRO  :ధర & ప్రత్యేకతలు

కోడాక్ 50FHDXPRO ధర – Rs.24,999  
ఇక ఈ స్మార్ట్ టీవీ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఇది 1920 X 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల FHD LED టీవీ మరియు ఇది 1.5 GHz క్లాక్ స్పీడ్ కలిగిన Cortex CA53 క్వాడ్ కోర్ ప్రాసెసరుతో వస్తుంది. అలాగే,  ఇది Android 7.1 వెర్షన్ తో నడుస్తుంది మరియు ఇన్ బిల్ట్ WiFi కూడా అందించబడినది. అధనంగా, ఈ స్మార్ట్ టీవీ 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజిని కూడా కలిగివుంటుంది. సౌండ్ విషయానికి వస్తే, ఇది స్టాండర్డ్, మైల్డ్, యూజర్ మరియు డైనమిక్ వంటి ఎంపికలతో వస్తుంది. ఈ టీవీ ఈ రోజు నుండి Flipkart ద్వారా అందుబాటులో ఉంటుంది.     

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :