BSNL Independence Day offer announced with extra 47 days validity with 2399 plan
BSNL Independence Day offer: భారతదేశం తన 80 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ఈ అద్భుతమైన రోజును పురస్కరిస్తూ, ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం గుడ్ న్యూస్ అందించింది. ఏకంగా 47 రోజుల అదనపు వ్యాలిడిటీ రూ. 2,399 వన్ ఇయర్ ప్లాన్ తో అందిస్తున్నట్లు బిఎస్ఎన్ఎల్ అనౌన్స్ చేసింది. ఇది యూజర్లు మెచ్చిన వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ గా చాలా కాలంగా వెలుగొందుతోంది మరియు ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్ తో మరింత గొప్పగా మారింది.
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ ఈ కొత్త ఆఫర్ ని అందించింది. ఆఫర్ ఏమిటంటే, చాలా కాలంగా బిఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం అందించిన రూ. 2,399 రూపాయల వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ పై 47 రోజుల అదనపు వ్యాలిడిటీ ని ఉచితంగా ఆఫర్ చేస్తోంది. అంటే, ఈ బిఎస్ఎన్ఎల్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 365 + 47 ఉచిత వ్యాలిడిటీ తో టోటల్ 412 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది.
బిఎస్ఎన్ఎల్ అందించిన ఈ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్ బడ్జెట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ గా చాలా కాలంగా విలసిల్లుతోంది. అయితే, బిఎస్ఎన్ఎల్ అందించిన కొత్త ఆఫర్ తో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ మరింత గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం రోజుకు కేవలం 5 రూపాయల 80 పైసలు మాత్రమే ఖర్చవుతుంది.
బిఎస్ఎన్ఎల్ ఇండిపెండెన్స్ డే ఆఫర్ తో వచ్చే ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు అనేక లాభాలు అందుతాయి. ఈ ప్లాన్ తో వచ్చే అదనపు 47 రోజుల ఉచిత వ్యాలిడిటీ తో కలిపి మొత్తం 412 రోజులు ఈ ప్లాన్ చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ ఫెసిలిటీ అందిస్తుంది.
అలాగే, డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా యూజర్లకు అందిస్తుంది. అంతేకాదు, ఈ డైలీ హై స్పీడ్ డేటా లిమిట్ ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది. బడ్జెట్ ధరలో లాంగ్ వ్యాలిడిటీ కోరుకునే వారికి ఇది బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది.
అయితే, ఈ ప్రత్యేకమైన ఆఫర్ 2026 సెప్టెంబర్ 12వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి, ఈ బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ఆఫర్ ముగిసే లోపు రీఛార్జ్ చేయండి.