50 అంగుళాల FHD ఆండ్రాయిడ్ LED టీవీ కేవలం రూ.24,999 ధరకే తీసుకొచ్చిన KODAK
సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, తన కొత్త కోడాక్ సిరిస్ నుండి KODAK 43FHDXPRO మరియు 50FHDXPRO ఆండ్రాయిడ్ టీవీ లను అతితక్కువ ధరకే ఇండియాలో విడుదల చేసింది.
ఇండియాలో టీవీ మరియు ఎలక్ట్రానిక్స్ తయారీదారు అయినటువంటి, సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, తన కొత్త కోడాక్ సిరిస్ నుండి KODAK 43FHDXPRO మరియు 50FHDXPRO ఆండ్రాయిడ్ టీవీ లను అతితక్కువ ధరకే ఇండియాలో విడుదల చేసింది. ఇవి కేవలం ఆండ్రాయిడ్ టీవీలు మాత్రమేకాకుండా, ఇవి 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజితో పాటుగా వస్తాయి.
Surveyకోడాక్ 43FHDXPRO :ధర & ప్రత్యేకతలు
కోడాక్ 43FHDXPRO ధర – Rs.20,999
ఇక ఈ స్మార్ట్ టీవీ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఇది 1920 X 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల FHD LED టీవీ మరియు ఇది 1.3 GHz క్లాక్ స్పీడ్ కలిగిన Cortex CA53 డ్యూయల్ కోర్ ప్రాసెసరుతో వస్తుంది. అలాగే, ఇది Android 5.1 వెర్షన్ తో నడుస్తుంది మరియు ఇన్ బిల్ట్ WiFi కూడా అందించబడినది. అధనంగా, ఈ స్మార్ట్ టీవీ 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజిని కూడా కలిగివుంటుంది. సౌండ్ విషయానికి వస్తే, ఇది స్టాండర్డ్, మైల్డ్, యూజర్ మరియు డైనమిక్ వంటి ఎంపికలతో వస్తుంది. ఈ టీవీ ఈ రోజు నుండి Flipkart ద్వారా అందుబాటులో ఉంటుంది.
కోడాక్ 50FHDXPRO :ధర & ప్రత్యేకతలు
కోడాక్ 50FHDXPRO ధర – Rs.24,999
ఇక ఈ స్మార్ట్ టీవీ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఇది 1920 X 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల FHD LED టీవీ మరియు ఇది 1.5 GHz క్లాక్ స్పీడ్ కలిగిన Cortex CA53 క్వాడ్ కోర్ ప్రాసెసరుతో వస్తుంది. అలాగే, ఇది Android 7.1 వెర్షన్ తో నడుస్తుంది మరియు ఇన్ బిల్ట్ WiFi కూడా అందించబడినది. అధనంగా, ఈ స్మార్ట్ టీవీ 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజిని కూడా కలిగివుంటుంది. సౌండ్ విషయానికి వస్తే, ఇది స్టాండర్డ్, మైల్డ్, యూజర్ మరియు డైనమిక్ వంటి ఎంపికలతో వస్తుంది. ఈ టీవీ ఈ రోజు నుండి Flipkart ద్వారా అందుబాటులో ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile