వోడాఫోన్ ఐడియా యూజర్లకు శుభవార్త : ఇక మిస్డ్ కాల్ మరియు SMS తో కూడా రీఛార్జ్
ఎలా రీఛార్జ్ చేయాలనే దానిపై స్టెప్ గైడ్ బై స్టెప్ అందించాము.
లాక్ డౌన్ మరొకసారి కొనసాగించబడి ఉన్నందున, కొంతమంది తమ స్మార్ట్ ఫోన్లను రీఛార్జ్ చేయడం కష్టం. బ్యాలెన్స్, డేటా లేదా వ్యాలిడిటీ ముగిసిన తర్వాత, వారి నంబర్‌ను రీఛార్జ్ చేయడానికి, వారి స్నేహితులపై ఆధారపడవలసి ఉంటుంది. అందుకోసమే, వోడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో మరియు ఎయిర్టెల్ వంటి సర్వీసు ప్రొవైడర్లు ప్రజలు తమ వినియోగదారులకు ATM ల ద్వారా రీఛార్జ్ చేసుకునే అవకాశం కల్పించారు. MyVodafone లేదా MyIdea అనువర్తనాన్ని ఉపయోగించి వేరేవారి నంబర్ ను రీఛార్జ్ చేస్తే వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు 6 శాతం వరకు క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది.
Surveyఇక వీటితో పాటుగా మరొక కొత్త విషయాన్ని కూడా జోడిస్తూ, వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు వారి మొబైల్స్ నుండి SMS మరియు మిస్డ్ కాల్ ద్వారా కూడా రీఛార్జ్ చేసే సామర్థ్యాన్ని ప్రకటించింది. ఈ సర్వీస్ ను ఉపయోగించడానికి, ఈ క్రింది బ్యాంకులలో ఒకదానితో మీకు ఖాతా ఉండాలి – SBI బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఇండూసింద్ బ్యాంక్ లేదా HDFC బ్యాంక్. ప్రతి బ్యాంకుకు సంబంధించిన నంబర్లతో పాటు SMS ద్వారా మీ స్మార్ట్ ఫోన్లను ఎలా రీఛార్జ్ చేయాలనే దానిపై స్టెప్ గైడ్ బై స్టెప్ క్రింద అందించాము.
వోడాఫోన్ ఐడియా SMS ద్వారా క్విక్ రీఛార్జ్
SBI బ్యాంక్ : 9223440000 కు SMS చేయండి
SMS ఫార్మాట్: Stopup <స్పేస్> యూజర్ ఐడి <స్పేస్> MPIN <space> VODAFONE / IDEA <space> 10 అంకెల మొబైల్ నంబర్ <స్పేస్> రీఛార్జ్ అమౌంట్
ICICI బ్యాంక్ కోసం: 9222208888 కు SMS చేయండి: MTOPUP <space> IDEA / VODAFONE <space> 10 అంకెల మొబైల్ నంబర్ <స్పేస్> రీఛార్జ్ అమౌంట్ <స్పేస్> బ్యాంక్ అకౌంట్ యొక్క చివరి 6 అంకెలు
యాక్సిస్ బ్యాంక్ కోసం: 9717000002/5676782 కు SMS చేయండి: MOBILE <స్పేస్> 10 అంకెల మొబైల్ నంబర్ <స్పేస్> VODAFONE / IDEA <స్పేస్> రీఛార్జ్ అమౌంట్ <స్పేస్> బ్యాంక్ అక్ యొక్క చివరి 6 అంకెలు
కోటక్ బ్యాంక్ కోసం: 9971056767/5676788 కు SMS: REC <space> 10 అంకెల మొబైల్ నంబర్ <స్పేస్> IDEA / VODAFONE <స్పేస్> రీఛార్జ్ అమౌంట్ <స్పేస్> బ్యాంక్ అక్ యొక్క చివరి 4 అంకెలు
ఇండస్‌ఇండ్ బ్యాంక్ కోసం: 9212299955 కు SMS చేయండి: MOB <space> 10 అంకెల మొబైల్ నంబర్ <space> VODAFONE / IDEA <space> రీఛార్జ్ అమౌంట్ <space> డెబిట్ కార్డు యొక్క చివరి 4 అంకెలు
SMS మరియు మిస్డ్ కాల్ ద్వారా క్విక్ రీఛార్జ్
HDFC బ్యాంక్ కోసం: 7308080808 కు SMS మరియు కాల్ చేయండి
1 వ దశ SMS: ACT <space> VODAFONE / IDEA <space> బ్యాంక్ అక్ యొక్క చివరి 5 అంకెలు
2 వ దశ SMS: FAV <space> 98XXXXXXXX <space> మొత్తం
7308080808 కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీ రీఛార్జిని నిర్ధారించుకోవచ్చు.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile