వోడాఫోన్ ఐడియా క్యాష్ బ్యాక్ ఆఫర్ : ఎవరికి రీఛార్జ్ చేసినా కమిషన్

HIGHLIGHTS

సూటిగా చెప్పాలంటే, మీరు కూడా ఈ కమిషన్ సంపాదించుకోవచ్చు.

వోడాఫోన్ ఐడియా క్యాష్ బ్యాక్ ఆఫర్ : ఎవరికి రీఛార్జ్ చేసినా కమిషన్

ఎయిర్టెల్ మరియు జియో అడుగుజాడలను అనుసరించి, వోడాఫోన్ ఐడియా కొత్త #RechargeforGood ప్రోగ్రామ్‌ ను ప్రవేశపెట్టింది, ఇది చందాదారులు ఇతర ప్రీపెయిడ్ ఖాతాలను రీఛార్జ్ చేసేప్పుడు వారు కమీషన్  సంపాదించడానికి అవకాశం ఇస్తోంది. వోడాఫోన్ ఐడియా యొక్క ఇప్పటికే ఉన్న వోడాఫోన్ లేదా ఐడియా కస్టమర్లు చేసే రీఛార్జ్‌ ల పైన  6 శాతం క్యాష్‌బ్యాక్‌ ను అందిస్తోంది. అయితే, ఈ రీఛార్జీలు మైవోడాఫోన్ లేదా మై ఐడియా యాప్ ఉపయోగించి మాత్రమే చేయాలి. ఈ 6 శాతం వోడాఫోన్ క్యాష్‌ బ్యాక్ ఆఫర్ జియో మరియు ఎయిర్టెల్ యొక్క 4.16 శాతం కమీషన్‌ మరియు ఇలాంటి ప్లాన్ల పైన ఇస్తున్న 4 శాతం క్యాష్‌బ్యాక్‌ ను మించిపోయింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

కరోనోవైరస్ లాక్డౌన్ కారణంగా వోడాఫోన్ ఐడియా అందించే రిటైలర్లు మరియు కంపెనీ షాపులు మూసివేయబడ్డాయి. అలాగే, చాలా మంది వినియోగదారులు తమ టెలికమ్యూనికేషన్ అవసరాలకు ఆన్‌లైన్ మోడ్‌ ను ఉపయోగించరు. ఈ వొడాఫోన్ ఐడియా క్యాష్‌బ్యాక్ మరియు ఇతర ఆపరేటర్ల నుండి వచ్చే కమీషన్లు ఈ కష్ట సమయాల్లో వారి స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా పొరుగువారు సంపాదించేలా సహాయపడటానికి అవకాశం ఇస్తుంది. సూటిగా చెప్పాలంటే, మీరు కూడా ఈ కమిషన్ సంపాదించుకోవచ్చు.  

ఎలా అనుకున్నటున్నారా?  అయితే ఏ విషయాన్ని గమనించండి. వోడాఫోన్ MyVodafone అప్లికేషన్ బ్యానర్‌ ను ఉపయోగించి #RechargeforGood ప్రోగ్రామ్‌ ను ప్రోత్సహిస్తోంది. ఈ క్యాష్‌ బ్యాక్ సంపాదించడానికి టెలికాం ఆపరేటర్‌ కు చందాదారులు విడిగా నమోదు చేయవలసిన అవసరం లేదు లేదా మరొక APP ఇన్‌స్టాల్ చేయవలసిన అవసరం లేదు. కేవలం ఐడియా లేదా వోడాఫోన్ మొబైల్ నంబర్లను, మీకు తెలిసిన వారు ఎవరైతే ఈ టెలికం ఆపరేటర్ల నంబర్లను కలిగి ఉంటారో వారి నంబర్లకు రీఛార్జ్ చేయవలసి ఉంటుంది. ఇక ఈ రీఛార్జ్ ద్వారా మీకు అందవలసిన క్యాష్‌బ్యాక్ మొత్తం 96 గంటల్లోపు వినియోగదారు ఖాతాకు జమ అవుతుంది.

ఇతర వ్యక్తుల ప్రీపెయిడ్ ఖాతాలను రీఛార్జ్ చేస్తున్న వినియోగదారులకు వోడాఫోన్-ఐడియా క్యాష్‌ బ్యాక్ అందిస్తుంది. వోడాఫోన్ 149 రూపాయల రీఛార్జిపై రూ .10 క్యాష్‌ బ్యాక్‌తో పాటు రూ .249 రీఛార్జి పై రూ .20 క్యాష్‌ బ్యాక్‌ ను అందిస్తున్నట్లు కూడా తెలియచేసింది. గమనించదగ్గ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, వినియోగదారు MyVodafone మరియు MyIdea అప్లికేషన్లను ఉపయోగించి మాత్రమే రీఛార్జ్ చేయవలసి ఉంటుంది మరియు ఇతర ప్రాంతాల నుండి రీఛార్జ్ చేసేవారికి మాత్రం ఈ క్యాష్‌బ్యాక్ ఇవ్వబడదు. ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు మాత్రమే ఉందని వోడాఫోన్ ప్రకటించింది.

వోడాఫోన్ రీఛార్జ్ ప్రణాళికల గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి!

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo