500 Mbps తో 4G డౌన్లోడ్ స్పీడ్ : త్వరలో ఎయిర్టెల్ చందాదారులు అందుకోవచ్చు

500 Mbps తో 4G డౌన్లోడ్ స్పీడ్ : త్వరలో ఎయిర్టెల్ చందాదారులు అందుకోవచ్చు
HIGHLIGHTS

ఎయిర్టెల్ తన వినియోగదారులకి ఎప్పుడు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని అందిచడంలో ముందుంటుంది.

అతిత్వరలో భారతి ఎయిర్టెల్ వినియోగదారులు 500Mbps వేగంతో డేటాను 4G నెట్ వర్క్ పైన అందుకునే  అవకాశాన్ని కంపెనీ అందించనున్నట్లు అనిపిస్తోంది. దేశంలో, ఈ తేలికోసంస్థ అత్యంత వేగాన్ని అందించడానికి సరికొత్త సాంకేతికతను సిద్ధంచేస్తోంది.  భారత దేశంలో, మొదటిసారిగా ఎయిర్టెల్ మరియు స్వీడన్ యొక్క ఎరిక్సన్ తో కలిసి ఒక లైసెన్సుడ్ అసిస్టెడ్ యాక్సెస్ (LAA) యొక్క లైవ్ LTE మొదటి ట్రయల్ ని ఈ శుక్రవారం చేపట్టింది. 

ET ప్రకారం, ఎయిర్టెల్  సెకనుకు ఒక GB స్పీడ్ అందించడం కోసం తయారుచేస్తున్న 5G నెట్ వర్కులో భాగంగా ఈ సరికొత్త డెవలప్మెంట్ మనముందుకొచ్చింది. ఈ ట్రయల్  సమయంలో, అంతర్గత వాతావరనంలో ఒక 500Mbps కంటే అధికమైన స్పీడు స్మార్ట్ ఫోనులో నమోదయ్యింది, మరియు సిగ్నల్ స్టేషనుకు 180 దూరంలో బాహ్య వాతావరణంలో దాదాపుగా 400Mbps కంటే అధికమైన స్పీడు స్మార్ట్ ఫోనులో డౌన్లోడింగ్ స్పీడ్ నమోదయినట్లు, ఈ టెలికం సంస్థ తెలిపింది .                          airtel 4g.jpg                                   

"ఎయిర్టెల్ తన వినియోగదారులకి ఎప్పుడు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని అందిచడంలో ముందుంటుంది. 5G మరియు గిగాబైట్స్ సాధించడం కోసం ఎరిక్సన్ భాగస్వామ్యంతో ఇండియాలో మొట్టమొదటి LAA ట్రయల్ ని నిర్వహింహడం మాకు సంతోషంగా వుంది.  ఈ LAA సాంకేతికత అనేది నిజమైన 4G స్పీడును తీసుకువస్తుంది" అని, భారతి ఎయిర్టెల్ యొక్క చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అయినటువంటి రణదీప్ సేఖాన్ ఒక స్టేట్మెంటులో తెలిపారు.      

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo