IMC 2025 లో Jio 6G టెక్నాలజీతో మెరిసిన రిలయన్స్ జియో.!

IMC 2025 లో Jio 6G టెక్నాలజీతో మెరిసిన రిలయన్స్ జియో.!

ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 (IMC 2025) పై ఈరోజు రిలయన్స్ జియో 6G టెక్నాలజీ ప్రదర్శించి మరో కొత్త మైలురాయిని చేరుకుంది. ఈరోజు జరిగిన IMC 2025 వేదికపై స్వదేశీ 6G టెక్నాలజీ స్టాక్‌ను (Indigenous 6G Stack) ఘనంగా ఆవిష్కరించి ఈ కొత్త మైలురాయి చేరుకుంది. చాలా దేశాలు ఇంకా 5జి కోసం నిర్మించడానికి చూస్తుంటే, ఇండియాలో 6జి నెట్ వర్క్ కోసం సిద్ధంగా ఉన్నట్లు ఈ జియో 6జి కొత్త ప్రదర్శన చెప్పకనే చెబుతోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

IMC 2025 : Jio 6G

న్యూ ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 (IMC 2025) వేదిక పై రిలయన్స్ జియో పూర్తిగా భారతదేశంలో అభివృద్ధి చేసిన 6G నెట్‌వర్క్ సొల్యూషన్స్, జిగాంటిక్ MIMO రేడియో, రీఫిగరబుల్ ఇంటెలిజెంట్ సర్ఫేసెస్ (RIS) మరియు నాన్-టెరెస్ట్రియల్ నెట్‌వర్క్స్ (NTN) వంటి కీలక భాగాలను ఈరోజు ప్రదర్శించింది.

ఈ కొత్త ప్రదర్శన ద్వారా రిలయన్స్ జియో చెబుతున్నట్లు ఎప్పుడు ఫ్యూచర్ కనెక్టివిటీ కోసం సిద్ధంగా ఉంటుందని మరోసారి నిరూపించింది. ఈ కొత్త 6జి ద్వారా కనెక్టివిటీ మరింత స్థిరంగా మరియు వేగంగా మార్చగలరని జియో చెబుతోంది.

IMC 2025  Jio 6G

ఈ కొత్త టెక్నాలజీ ద్వారా స్పేస్-బేస్డ్ ఇంటర్నెట్ కనెక్షన్, అత్యంత వేగవంతమైన డేటా ట్రాన్స్ఫర్ అవకాశం, ప్రస్తుతం అవసరమైన మరియు ముఖ్యమైన AI ఆధారిత నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్ మరియు స్మార్ట్ సిటీస్ మరియు ఐఓటీ ఎకో సిస్టమ్స్ వంటి కొత్త వాటిని ప్రోత్సహించడం వీలవుతుంది.

కొత్తగా అందించే జియో జిగాంటిక్ MIMO (gMIMO) ద్వారా ఒకేసారి ఎక్కువ మందికి వేగవంతమైన కనెక్టివిటీ అందించడం సాధ్యం అవుతుంది. ఈ కొత్త అప్డేట్ గురించి జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ, “భారతదేశం 5G లో ముందుండి, 6G లో ప్రపంచాన్ని నడిపించే దిశగా అడుగులు వేస్తోంది. మా 6G టెక్నాలజీ పూర్తిగా ‘Made in India, Made for the World’ కాన్సెప్ట్‌తో అభివృద్ధి చేయబడింది,” అన్నారు.

Also Read: Samsung Galaxy Buds 3 Pro రూ. 8,000 భారీ డిస్కౌంట్ అందించిన అమెజాన్ సేల్.!

అంతేకాదు, ఇది కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా దేశం వెలుపల గ్లోబల్ మార్కెట్ ని సైతం చేరుకుంటుందని వెల్లడించారు. ఇది జియో బ్రెయిన్ శక్తితో చాలా స్మార్ట్ గా ఉంటుందని కూడా చెబుతున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo