Jio: గుంటూరు, విజయవాడ, తిరుమల మరియు వైజాగ్ ప్రజలకు జియో గుడ్ న్యూస్.!

HIGHLIGHTS

గుంటూరు, విజయవాడ, తిరుమల మరియు వైజాగ్ ప్రజలకు జియో గుడ్ న్యూస్

ఈ నగరాల్లో రిలయన్స్ జియో తన True 5G సర్వీస్ లను లాంచ్ చేసింది

యూజర్లు Unlimited 5G ఆనందించవచ్చు

Jio: గుంటూరు, విజయవాడ, తిరుమల మరియు వైజాగ్ ప్రజలకు జియో గుడ్ న్యూస్.!

Jio: గుంటూరు, విజయవాడ, తిరుమల మరియు వైజాగ్ ప్రజలకు జియో గుడ్ న్యూస్ తెలిపింది.  తిరుమల, విశాఖపట్టణం, గుంటూరు మరియు విజయవాడ నగరాల్లో రిలయన్స్ జియో తన True 5G సర్వీస్ లను లాంచ్ చేసింది. ఇది మాత్రమే కాదు, 'Jio Welcome Offer' లో ద్వారా వినియోగదారులకు అన్లిమిటెడ్ 5G డేటాని అందిస్తున్నట్లు కూడా జియో ప్రకటించింది. డిసెంబర్ 26 న రిలయన్స్ జియో ఈ నాలుగు పట్టణాల్లో తన 5G నెట్వర్క్ ను ప్రారంభించింది.  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రిలయన్స్ తాన్ True 5G ద్వారా వేగవంతమైన కనెక్టివిటీ నెట్ వర్క్ ను అందించడమే కాయకుండా ఈ నగరాల్లోని ప్రజలు 'JIO WELCOME OFFER' అఫర్ లో భాగంగా 1Gbps+ స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటాని పొందుతారని కూడా జియో వెల్లడించింది. అలాగే, 2023 జనవరి నాటికి మరిన్ని సిటీల్లో Jio True 5G సర్వీస్ లు అంధుబాటులోకి వస్తావని కూడా జియో ప్రకటించింది. 

మీరు Jio True 5G సేవలను వినియోగించుకోవడానికి మీ సిమ్ కార్డును మార్చవలసిన అవసరం లేదు మరియు ఈ సర్వీసులను మీ 4G సిమ్ కార్డ్ పైనే ఆనందించవచ్చు. అంతేకాదు, 4G ప్లాన్స్ పైనే మీరు 5G ని ఎంజాయ్ చేయవచ్చు. ఇక మీ 5G ఫోన్ లో 5G నెట్ వర్క్ సెట్ చేసుకోవడానికి, ఫోన్ మీ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి,సిమ్ కార్డు ఎంచుకొన్న తరువాత 'Preferred network type' అప్షన్ ను ఎంచుకోండి. ఇక్కడ మీకు నెట్ వర్క్ టైప్ (3G,4G,5G) చూపిస్తుంది. మీ నెట్ వర్క్ టైప్ ను 5G గా ఎంచుకోండి మరియు మీకు 5G నెట్ వర్క్ ఎనేబుల్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo