Install App Install App

జియో ప్లాన్స్: రూ.100 లోపలే డైలీ హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 24 Aug 2021
HIGHLIGHTS
  • తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభానిచ్చే బెస్ట్ ప్లాన్

  • 98 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్

  • రూ. 39 మరియు రూ. 69 ప్లాన్స్

జియో ప్లాన్స్: రూ.100 లోపలే డైలీ హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్
జియో ప్లాన్స్: రూ.100 లోపలే డైలీ హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్

రిలయన్స్ జియో చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభానిచ్చే బెస్ట్ ప్లాన్ ని తిరిగి తీసుకోచ్చింది. గతంలో అందుబాటులో ఉంచిన ఈ ప్లాన్ ను కొంతకాలంగా నిలిపివేసింది. అయితే, ఇప్పుడు మళ్ళి తన కస్టమర్ల కోసం తిరిగి ప్రకటించింది. అదే, 98 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ హై స్పీడ్ డేటా మరియు మరికొన్ని ప్రయోజాలను అందిస్తుంది. అలాగే, చాలా తక్కువ ధరకే మరిన్ని ప్రయజాలను అందించేలా రూ. 39 మరియు రూ. 69 ప్లాన్స్ ని కూడా అందించింది. ఈ ప్లాన్స్ అందించే అన్ని ప్రయోజాలను గురించి చూద్దాం.

Jio రూ. 98 ప్లాన్ ప్రయోజనాలు

ఈ  Jio రూ. 98 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ బెనిఫిట్స్ తో వస్తుంది. ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌలభ్యం అందుతుంది. అలాగే, రోజుకు 1.5 GB హై స్పీడ్ 4G డేటా కూడా లభిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది. అయితే, ఈ Jio రూ. 98 ప్లాన్ తో ఎటువంటి ఉచిత SMS సర్వీస్ ను ఇవ్వడం లేదు. ఈ ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అంటే, 14 రోజులకు గాను మొత్తంగా 21GB హై స్పీడ్ డేటాని అందుకుంటారు.

Jio రూ. 39 ప్లాన్ ప్రయోజనాలు

ఇక ఇటీవల ప్రకటించిన కొత్త రూ.39  మరియు రూ.39 ప్లాన్స్ విషయానికి వస్తే, రూ.39 ప్రీపెయిడ్ ప్లాన్ తో మీకు రోజు 100MB హై స్పీడ్ డేటా లభిస్తుంది. అధనంగా, అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్  సౌకర్యం కూడా లభిస్తుంది. రోజువారీ డేటా లిమిట్ తరువాత స్పీడ్ లిమిట్ 64Kbps కు తగ్గించబడుతుంది. అయితే,ఈ ప్లాన్ ముగిసిన తరువాత మరొక ప్లాన్ మీకు ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్ ముగిసిన తరవాత దాన్ని వాడుకోవచ్చు.

Jio రూ. 69 ప్లాన్ ప్రయోజనాలు

ఇక రూ.69 ప్రీపెయిడ్ ప్లాన్ తో మీకు రోజు 512MB హై  స్పీడ్ డేటా లభిస్తుంది. అధనంగా, అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్  సౌకర్యం కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ తో రోజుకు 100SMS లు మరియు జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. రోజువారీ డేటా లిమిట్ తరువాత స్పీడ్ లిమిట్ 64Kbps కు తగ్గించబడుతుంది.

మరిన్ని బెస్ట్ JIO ప్లాన్ కోసం Click Here

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: reliance jio best budget plans under rs 100
Tags:
reliance jio reliance jio jio4g jio unlimited jio prepaid plans జియో జియో ప్లాన్స్
Install App Install App
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status